హైదరాబాద్, జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. దర్యాప్తు చేయడానికి వెళ్లిన కానిస్టేబుళ్లపై దుండగుడు తల్వార్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన కానిస్టేబుళ్లు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజు, వినయ్ అను ఇద్దరు కానిస్టేబుళ్లు మాదాపూర్ ఎస్‌వోటీ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరు ఓ కేసు దర్యాప్తు నిమిత్తం సిక్కుల బస్తీకి వెళ్లారు. అక్కడ గుర్తు తెలియని ఓ వ్యక్తి తల్వార్తో వారిపై దాడి చేశాడు. దుండగుడు.. రాజు అనే కానిస్టేబుల్ను ఛాతీలో పొడవగా, వినయ్‌కు తలపై గాయాలయ్యాయి.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని.. తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుల్స్‌ను చికిత్స నిమిత్తం కూకట్‌పల్లి రాందేవ్ రావు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు పరామర్శించారు. కానిస్టేబుళ్లు సివిల్ డ్రెస్‌లో రావడంతో.. వారిని శత్రువులుగా భావించి నిందితుడు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.