సమాజంలో ఆస్తి తగాదాల్లో ఎన్నో దారుణమైన ఘటనలు జరుగుతూ తరుచు వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే మాములుగా ఆస్తివాటాల విషయంలో అన్నాదమ్ముల మధ్య గొడవలు చివరకు హత్యల వరకు వెళ్తున్నాయి. కానీ ఈ సారి అన్నదమ్ముల మధ్య కాకుండా తండ్రి కొడుకు మధ్య జరిగి ఏకంగా హత్య వరకు వెళ్లింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..చిత్తూరు జిల్లాలోని కేవీపల్లె మండలం తువ్వపల్లె పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన చిన్నకోట్ల జయరామ్ మొదటి భార్య కుమారుడు గిరిబాబు అలియాస్ రవి.
ఇక తన తండ్రితో ఆస్తి పంపకాల విషయమై తరుచు గొడవకు దిగే వాడు కుమారుడు రవి. దీంతో వీరిద్దరి మధ్య రోజు గొడవలు జరుగుతూనే ఉండేవి. ఆస్తి పంపకాల్లో వాటా అడుగుతున్నాడని తండ్రి ఎలాగైన కుమారుడైన రవిని అంతమొందించాలనుకున్నాడు. కన్న కొడుకుపై కక్ష పెంచుకున్న తండ్రి జయరామ్ కొడుకు ఆగడాలను భరించలేకపోయాడు. ఇక తనతో కాదని భావించి కిరాయి మనుషులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
ఇక జయరామ్ పథకం ప్రకారం రెడ్డివారిపల్లెకు చెందిన కొరముట్ల మల్లికార్జున, మదనపల్లెలోని రామిరెడ్డి లేఅవుట్‌కు చెందిన గదేముతక చంద్రశేఖర్, పుంగనూరు మండలం మేళందొడ్డికి చెందిన వడ్డీ సురేష్‌లతో రూ.9లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీంతో కిరాయి హంతకులు రవిని అతి కిరాతకంగా హత్య చేశారు. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. దీంతో పోలీసుల విచారణలో మాత్రం ఖంగుతినే నిజాలు వెలుగులోకి వచ్చాయి. కన్నతండ్రే కుమారుడు రవిని హత్య చేశాడని తేలడంతో పోలీసులు జయరామ్‌తో సహా నిందితులందరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.