ప్రజలకు ఆదర్శంగా నిలవాల్సిన కొందరు పోలీసులే తప్పుడు పనులు చేస్తున్నారు. తమ ఖాకీ చొక్కా బలం చూసుకుని రెచ్చిపోతున్నారు. తమకో న్యాయం.. మిగిలిన వారికి ఓ న్యాయం అని అంటున్నారు. కొందరు పోలీసులు అవినీతి పాల్పడుతుంటే.. మరి కొంతమంది బరితెగించి ప్రవర్తిస్తున్నారు. తాజాగా, ఓ పోలీస్ ఇన్‌స్పెక్టర్ భార్య బతికి ఉండగానే మరో మహిళతో ప్రేమలో పడ్డాడు. భార్యను పట్టించుకోకుండా ప్రియురాలితోనే తిరుగుతూ ఉన్నాడు. దీంతో భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. సదరు సీఐ కారులో ప్రియురాలితో సరసాలు ఆడుతూ అడ్డంగా బుక్కయ్యాడు. తోటి పోలీసులకు చిక్కి కటకటాల పాలయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్‌లో నగరంలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజు అనే వ్యక్తి హైదరాబాద్‌లోని వనస్థలిపురం సీఐగా విధులు నిర్వహిస్తున్నాడు.
రాజుకు పెళ్లై పిల్లలు కూడా ఉన్నారు. అయినప్పటికి రాజు వేరే మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. ఎక్కువగా ప్రియురాలితోనే గడిపేవాడు. ఈ విషయం రాజు భార్యకు తెలిసింది. పిల్లలను పెట్టుకుని ఇదేం పాడు బుద్ధి అనుకుంది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తాజాగా, విచారణ కోసం ఓ కానిస్టేబుల్ రాజు దగ్గరకు వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే రాజు విచారణ కోసం వెళ్లిన కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. దీంతో మరికొంతమంది పోలీసులు ఆయన్ని పట్టుకోవటానికి వెళ్లారు. కారులో ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న ఆయన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఆయన్ని స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.