‘బిగ్ బాస్ 5 తెలుగు’ రానురాను ఉత్కంఠగా సాగుతోంది. తాజాగా జెస్సీ హౌస్ నుంచి బయటకు వచ్చేశాడు. అతడిని ఎలిమినేట్ అనలేం.. ఆరోగ్య సమస్యల రీత్యా తదుపరి ట్రీట్మెంట్ కోసం జెస్సీని బయటకు పంపక తప్పలేదని నాగార్జున తెలిపాడు. అసలు మొదటి వారం ఎలిమినేట్ అవుతాడు అనుకున్న జెస్సీ పది వారాలు హౌస్ లో కొనసాగాడు అంటే అందరినీ ఆశ్చర్యపరిచింది. జెస్సీ ఒక ఫైటర్ గా హౌస్ నుంచి బయటకు వచ్చాడు. హౌస్ లోకి రాక ముందు అసలు జెస్సీ అంటే ఎవరో ఎవరికీ తెలీదు. కానీ, బిగ్ బాస్ హౌస్ జర్నీతో జెస్సీ ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇక సోమవారం వచ్చింది అంటే హౌస్ లో ఫన్ డే. ఈ వారం నామినేషన్స్ కూడా వాడీవేడిగా సాగాయి. నామినేట్ చేసే వ్యక్తి తలపై ఒక సీసా నిండా ఉన్న సిరప్ పోయాలి. మరి ఈ వారం నామినేషన్స్ లో ఎవరున్నారో చూడండి.
ఇదీ చదవండి: ఆస్ట్రేలియా డ్రెస్సింగ్ రూమ్ లో అంబరాన్ని అంటిన సంబరాలు.. వీడియో వైరల్
హౌస్ లో ఈ వారం నామినేషన్స్ ఇంట్రెస్టింగ్గా సాగాయి. నామినేషన్స్ లో షణ్ముఖ్, సిరి, యానీ మాస్టర్, సింగర్ శ్రీరామ్, ప్రియాంక సింగ్, వీజే సన్నీ, కాజర్, మానస్ ఉన్నారు. అవును మీరు అనుకున్నది కరెక్టే.. ఒక్క కెప్టెన్ రవి మినహా మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు. రవి కెప్టెన్ కాబట్టి బతికిపోయాడు. లేదంటే సన్నీ, మానస్, కాజల్ కచ్చితంగా యాంకర్ రవిని నామినేట్ చేసేవాళ్లు. గత రెండు వారాల నుంచి కూడా అదే జరుగుతోంది. ఒక్క కెప్టెన్ మినహా అందరూ నామినేషన్స్ లో ఉంటున్నారు. 19 మందితో మొదలైన బిగ్ బాస్ సీజన్ 5 ఇప్పుడు 9 మందికి చేరుకుంది. ఒక్కో వారం గడిచే కొద్దీ ఆట మరీ ఉత్కంఠగా సాగుతోంది. ఈ వారం హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.