ప్రపంచంలో భారతీయ సంస్కృతి చాలా భిన్నమైంది. ఇక్కడ ఆలయంలో వెలసిన దేవుడితో పాటు.. ప్రకృతిని కూడా పూజిస్తారు. నదులను, చెట్లను, రాళ్లను పూజించే సమాజం మనది. ఇక మన దగ్గర అప్పుడప్పుడు కొన్ని విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆయా దేవుళ్లకే సంబంధించిన కొన్ని ప్రత్యేక పర్వదినాల్లో.. వారి అంశలు ఉన్నట్లుండి ఆలయంలో దర్శనమివ్వడం, పొలాల్లో దేవుడి విగ్రహాలు బయటపడటం లాంటివి చూశాం. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి కర్నూలు జిల్లాలో చోటు చేసుకంది. ఓ ఇంటిలో నల్ల నాప బండరాయిలో నుంచి శివలింగం బయటకు ఉద్బవిస్తోంది. రోజురోజుకు శివలింగం పరిమాణం పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఈ వింత ఘటన చూసేందుకు ప్రజలు భారీగా తరలి వెళ్తున్నారు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా, నందవరం మండలానికి చెందిన నాగలక్ష్మి అనే మహిళ కుటుంబం మూడేళ్ల క్రితం ఓ కొత్త ఇంటిని నిర్మించుకున్నారు. ఇల్లు నిర్మించే సమయంలో అడుగు భాగాన నల్లటి నాప బండరాయిలు వేయించారు. అయితే కొన్ని రోజుల క్రితం.. గోడకు దగ్గరగా ఉన్న ఓ నల్లటి నాప బండరాయిపై ఒక చిన్న పాటి రంధ్రం లాంటిది కుటుంబసభ్యుల కంటపడ్డది. అదేదో బండ మీద బరువవైన వస్తువు పడి అలా అయిందని అనుకున్నారు. కానీ గత వారం రోజుల నుంచి ఆ నల్ల బండపై చిన్న రంధ్రంలో నుంచి శివ లింగ రూపం బయటకు ఉద్బవిస్తూ వచ్చింది. ఇది గమనించిన నాగలక్ష్మి, తన ఇంట్లో సాక్ష్యత్తూ.. శివుడు కొలువైయ్యాడని, పూజలు చేయడం మొదలు పెట్టింది. మూడు రోజుల నుంచి అక్కడ ఉద్బవించిన శివ లింగం పరిమాణం అంతకు అంత పరిమాణం పెరుగుతోందని స్థానికంగా జోరుగా ప్రచారం జరిగింది.
ఇది కూడా చదవండి: సోషల్ మీడియాని షేక్ చేస్తున్న 3 తలల పాము!
దీంతో శివ లింగాన్ని చూడటానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు తండోపతండాలుగా వస్తున్నారు. శివలింగం ఉన్నచోట కొబ్బరికాయలు కొడుతూ, పెద్ద ఎత్తున పూజలు చేస్తున్నారు. అయితే, కొంతమంది హేతువాదులు మాత్రం ఇది కేవలం భూమిలోని మార్పు వల్ల ఇలా బండ రాయి ఉబ్బుకోని బయటకు వచ్చిందని చెప్తున్నారు. స్థానికులు మాత్రం శ్రీశైల మల్లన్న స్వామి కొలువయ్యాడని చెప్తున్నారు. మరి ఈ వింత ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.