ఏ దేశంలోనైనా గ్రామాలు, పట్టణాలు ఉంటాయి. అయితే ఈ రెండు ప్రాంతాల్లో ప్రజల జీవన విధానాల్లో చాలా తేడాలుంటాయి. నగరాల్లో అయితే చదువుకున్నవారు, ఉద్యోగస్తులు, వ్యాపారులు ఉంటారు. గ్రామాల విషయానికొస్తే.. వ్యవసాయదారులు, వృత్తిపనివారు ఉంటారు. దీంతో నగరాల్లో ఉన్నంత అభివృద్ధి, గ్రామాల్లో ఉండదనే చెప్పాలి. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఆసియా ఖండంలోనే ధనిక గ్రామంగా ఓ గ్రామం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది.