గత కొంత కాలంగా దేశంలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ, రాజకీయ నాయకులు వరుసగా కన్నుమూస్తున్నారు. ప్రముఖ ఆదివాసీ నేత, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి హేమానంద బిశ్వాల్ (83) కన్నుమూశారు. భువనేశ్వర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు హేమానంద బిస్వాల్ మరణవార్తను ఆయన కుమార్తె సునీతా బిస్వాల్ తెలిపారు. కొద్ది రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురయ్యారు. పశ్చిమ ఒడిశా జిల్లాల్లో ప్రముఖ ఆదివాసీ నేత […]