జార్ఖండ్‌లో దారుణం జరిగింది. వాకింగ్‌కు వెళ్లిన జడ్జిని ఆటోతో గుద్ది చంపారు. ఈ అమానుష ఘటన ధన్‌బాద్‌లో బుధవారం ఉదయం జరిగింది. ధన్‌బాద్‌లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఎడిజే ఉత్తమ్ ఆనంద్ బుధవారం మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లారు. ఆయన మేజిస్ట్రేట్ కాలనీ సమీపంలోని రణధీర్ వర్మ చౌక్ వద్దకు చేరుకోగానే ఒక ఆటో వెనుక నుంచి వచ్చి ఆయనను టార్గెట్‌గా చేసుకొని ఢీకొట్టింది. దాంతో జడ్జి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించగా.. […]