మునుగోడు ఉప ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ విజయం సాధించింది. టీఆర్‌ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లతో ఈ ఎన్నికల్లో విజయ భేరీ మోగించారు. బీజేపీ అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై దాదాపు 10 వేల ఓట్లకు పైగా మెజార్టీతో గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 95,028 ఓట్లు సాధించగా.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 85,128 ఓట్లు సాధించారు. మొత్తం 15 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. మొదటి 3 రౌండ్లలో […]
ఈ మధ్యకాలంలో తెలంగాణ రాజకీయాలు రసవత్తంగా సాగుతున్నాయి. ఇటీవల కొన్ని రోజుల నుంచి మునుగోడు ఉపఎన్నిక జోరుగా కొనసాగుతుంది. అధికార, ప్రతిపక్షాలు విజయం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఇలాంటి సమయంలో గత రెండు రోజుల క్రితం జరిగిన ఓ ఘటన తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. మొయినాబాద్ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేల కొనుగోలు కుట్ర వ్యవహారం తెరపైకి వచ్చింది. దీంతో ఒకసారిగా రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టుకొచ్చాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష […]
బిగ్ బ్రేకింగ్.. తెలంగాణ రాజకీయాల్లో సంచలనం. హైదరాబాద్‌లో ఆపరేషన్ ఆకర్ష్ విఫలమయింది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు మధ్యవర్తులు రంగంలోకి దిగినట్లుగా పోలీసులకు పక్కా సమాచారం అందడంతో నగర శివార్లలోని పీవీఆర్ ఫాం హౌస్‌పై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులు, కోట్లలో నగదు పట్టుబడింది. పట్టుబడిన వారిలో రామచంద్రభారతి, సింహయాజులు, నందకుమార్‌లు ఉండగా, ఆ నలుగురు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, పైలట్ రోహిత్ రెడ్డి, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ […]
మరికొన్ని రోజుల్లో మునుగోడు ఉప ఎన్నిక జరగనుంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం సాగుతోంది. ఇక అన్ని పార్టీలు ప్రచారం మీద దృష్టి పెట్టాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తున్నాయి. మునుగోడులో భారీగా డబ్బు ఖర్చు చేస్తున్నారు నేతలు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి శాయశక్తుల ప్రయత్నిస్తున్నారు. అన్ని రకాలుగా ఓటర్లను ప్రలోభ పెడుతున్నారు. వెరసి మునుగోడు ఎన్నిక దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా మారనుంది. టీఆర్‌ఎస్‌తో పోల్చితే కాంగ్రెస్, బీజేపీలకు మునుగోడులో గెలుపు అనివార్యం. పైగా.. బీజేపీ అభ్యర్థి […]
వైఎస్సార్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. మా నాన్నని కుట్ర చేసి చంపినట్లే నన్నుకూడా చంపేందుకు ప్లాన్ చేస్తున్నారు అన్నారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారాయి. ఆదివారం మీడియాతో మాట్లాడిన షర్మిల ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. నేను పులి బిడ్డనని, నాపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని, దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయాలని ఆమె సవాల్ విసిరారు. నేను బతికున్నంత కాలం ప్రజల […]
Rajaiah: టీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తనపై చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రాజయ్య మండిపడ్డారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం తన అడ్డా అని అన్నారు. కడియం శ్రీహరి దళిత దొర అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియా ప్రతినిధులు ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ.. ‘‘ కడియం శ్రీహరి నామీద చేసిన అభియోగాలను తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ రోజు మాటిమాటికి గురివింద సామెతలెక్క..దొంగే, దొంగ దొంగ అన్నట్లు.. మాట్లాడితే అవినీతి […]
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తెల్థారుపల్లిలో టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్యను దుండగులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. దీంతో ఖమ్మం జిల్లాలో హైటెన్షన్ మొదలైంది. వివరాల్లోకి వెళితే.. స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ముగించుకొని తమ్మినేని కృష్ణయ్య బైకుపై ఇంటికి వెళ్తుండగా కొంతమంది వ్యక్తులు ఆటోతో ఆయన వాహనాన్ని బలంగా ఢీ కొట్టారు. కింద పడిపోయిన ఆయనపై వేట కొడవళ్లతో విరుచుకుపడ్డారు. ఆయన చనిపోయినట్టు నిర్ధారణ చేసుకొని అక్కడ నుంచి పారిపోయారు. కృష్ణయ్య మరణ […]
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓ వివాదంలో చిక్కుకున్నారు. మహబూబ్ నగర్ లో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించారు. ఫ్రీడమ్ ర్యాలీలో పాల్గొన్న మంత్రి పోలీసుల వద్దనుండే ఎస్ఎల్ఆర్ వెపన్ తీసుకుని గాల్లోకి కాల్పులు జరిపారు. అందుకు సంబంధించిన వీడియోలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మంత్రి చేసిన పనిపై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి చేసిన చర్యపై ప్రస్తుతం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ అలా […]
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ దూకుడు పెంచారు. టీఆర్‌ఎస్, కేసీఆర్‌ను టార్గెట్ చేసి విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తాను అని ప్రకటించిన ఈటల.. మరోసారి మీడియా ముఖంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌ను ఓడించకపోతే.. ఈ జన్మకు సార్థకత లేదన్నారు. అంతేకాక 2018 ఎన్నికల్లోనే కేసీఆర్ తనను ఓడించడానికి ప్రయత్నించడాని ఈటల సంచలన ఆరోపణలు చేశాడు. ఈ సందర్భంగా ఈటల మీడియాతో […]
దేశవ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. పార్లమెంట్‌లో 99.18 శాతం ఓటింగ్ నమోదైనట్లు చీఫ్ రిటర్నింగ్ అధికారి పీసీ మోదీ తెలిపారు. పార్లమెంటులో ఓటు వేసేందుకు భారత ఎన్నికల కమిషనర్ అనుమతించిన 736 మంది ఓటర్లలో (727 మంది ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) 730 మంది (721 ఎంపీలు, తొమ్మిది మంది ఎమ్మెల్యేలు) ఓటు వేసినట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ […]