ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు ఇంకా మండిపోతున్నాయి. ఈ క్రమంలో పాఠశాలలు వేసవి సెలవులు ముగించుకుని రీఓపెన్ అయ్యేందుకు సన్నద్ధమవుతున్నాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఓ రకమైన ఆందోళన చోటుచేసుకుంటుంది. ఎండల్లో పిల్లలను స్కూల్స్ పంపిస్తే ఆనారోగ్యాలకు గురవుతారని ఏం చేయాలో అర్థంకాక అయోమయంలో పడిపోయారు.
AP: అభివృద్ధిలోనూ.. పెట్టుబడుల ఆకర్షణలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే సత్తా చాటుతోంది. ఇండియాలో అత్యంత స్పీడుగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఏపీ అవతరించింది. 2021-22లో రెండంకెల వృద్ధి రేటుతో ఏపీ.. భారత్‌లోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని తాజాగా, కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ నివేదిక విడుదల చేసింది. 2021-22లో దేశ జీడీపీ వృద్ధిరేటు 8.7 శాతం కాగా.. ఏపీ వృద్ధిరేటు ఏకంగా 11.43 శాతంగా ఉంది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ మూడేళ్లుగా అగ్రస్థానంలో నిలుస్తోంది. […]
APIIC: వైఎస్సార్ సీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (ఏపీఐఐసీ) సత్తా చాటుతోంది. మౌలిక వసతుల కల్పన, ఆదాయ ఆర్జనలో అద్భుతమైన ఫలితాలను సాధిస్తోంది. రాష్ట్ర విభజన నాటి నుంచి ఎప్పుడూ లేనట్లుగా.. 2021–22 కాలంలో ఇంజనీరింగ్ పనుల కోసం రికార్డు స్థాయిలో రూ.348.71 కోట్లు ఖర్చు చేసింది. అధికారిక గణాంకాల ప్రకారం.. 2014 నుంచి 2022 వరకు రూ.2,079 కోట్లు ఖర్చు చేస్తే.. ఆ మొత్తంలో ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న టీడీపీ […]
RK Roja: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు ప్రకటనతో ఏపీ రాజకీయాలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. అధికార, విపక్ష పార్టీల్లోని నాయకులు ఒకరిపై ఒకరు ఈ విషయంపై విమర్శలు చేసుకుంటున్నారు. పేరు మార్పుపై సీఎం వైఎస్ జగన్‌పై బాలయ్య చేసిన వ్యాఖ్యలకు మంత్రి రోజా కొద్దిరోజుల క్రితం కౌంటర్ ఇచ్చారు. ఆమె తన ట్విటర్ ఖాతా ద్వారా స్పందించారు. ‘‘ బాలయ్య ప్లూటు బాబు ముందు ఊదు… జగన్ అన్న ముందు కాదు, […]
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వచ్చిన ముప్పు ఏమీ లేదని, రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రం ఆర్థికంగా బాగానే ఉందని చెబితే కొందరు ఆ వాస్తవాన్ని జీర్ణించుకోలేరని అన్నారు. రాష్ట్రానికి నిధులు రానివ్వకపోతే పథకాలు ఆగిపోతాయని కొన్ని శక్తులు అనుకుంటున్నాయంటూ మండిపడ్డారు. శుక్రవారం రెండో రోజు వర్షాకాల సమావేశాల్లో పెట్టుబడులు, పారిశ్రామిక ప్రగతిపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ […]
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నాడు-నేడు కింద పనులు పూర్తి చేసుకున్న స్కూళ్లపై ఇకపై నెలనెలా ఆడిట్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. విద్యార్థులు స్కూళ్లలోని సమస్యలను ఫిర్యాదు చేయటానికి వీలుగా ప్రతీ స్కూల్లో 14417 టోల్‌ఫ్రీ నెంబర్ బోర్డు ఉంచాలన్నారు. వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్, మహిళా పోలీస్, ఏఎన్‌ఎమ్‌లు ప్రతీ […]
YS Jagan Mohan Reddy: పేదల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరో అద్భుతమైన పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు అక్టోబర్ 1నుంచి ఏపీ ప్రభుత్వం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాలను అమలు చేయనుంది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక కల్యాణమస్తు, షాదీ తోఫాలను ఆపేసిందన్న తప్పుడు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బిగ్ […]
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ఎంపిక చేసింది. ఈ మేరకు శనివారం పురస్కారాలకు ఎంపికైన ఉపాధ్యాయుల లిస్టును ప్రకటించింది. ఇక, భారతదేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఈ 176 మంది ఉత్తమ ఉపాధ్యాయులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సత్కరించునున్నారు. సెప్టెంబర్ 5న విజయవాడలోని ‘ఎ’ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలు అందించనున్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన […]
Digital Health Card Distribution: ప్రజా సంక్షేమం విషయంలో ఏపీ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు కూడా తెచ్చుకుంటోంది. పలు మార్లు కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు పొందింది. తాజాగా, ఏపీ ప్రభుత్వం మరో ఘనతను సాధించింది. డిజిటల్ హెల్త్ కార్డుల పంపిణీకి సంబంధించి ఏపీ దేశంలోనే నెంబర్ 1గా నిలిచింది. ఎకనమిక్స్ టైమ్స్ విడుదల చేసిన అవార్డులో ఏపీకి మొదటి బహుమతి వచ్చింది. హెల్త్ కార్డ్‌ల డిజిటలైజేషన్, ఈజ్ […]
YS Jagan Mohan Reddy: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్షాల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న మంచి పనులను కుట్రదారులు జీర్ణించుకోలేకపోతున్నారని, రాళ్లు వేస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వం మొత్తం దోచుకో.. పంచుకో.. తినుకో అనే స్కీముతో నడిచిందని విమర్శించారు. గురువారం కృష్ణా జిల్లా పెడనలో వైఎస్సార్ నేతన్న నేస్తం 4వ విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. 4వ విడత నిధులను విడుదల చేశారు. […]