టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సూపర్ స్టార్‌గా కుమార్తె అయినప్పటికి.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉంటుంది. యూట్యూబ్‌లో తన స్నేహితురాలు ఆద్యతో కలిసి.. ఆద్య అండ్ సితార అనే యూట్యూబ్ చానెల్ నిర్వహిస్తోంది. చిన్న వయసులోనే.. ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది సితార. ఇక సోషల్ మీడియాలో తల్లిదండ్రులతో కలిసి వెకేషన్, సోదరుడితో కలిసి ఎంజాయ్ చేసే ఫోటోలతో పాటు.. అప్పుడప్పుడు తన స్పెషల్ ఫోటో షూట్స్ పిక్స్ కూడా షేర్ చేస్తుంటుంది. తాజాగా సితార లేటేస్ట్ ఫోటో షూట్‌కి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
తాజా ఫోటో షూట్‌లో సితార.. లైట్ పింక్ కలర్ మినీ స్కర్ట్‌లో.. చిరునవ్వులు చిందిస్తూ.. చందమామను మించే అందంతో మెరిసిపోయింది. తన క్యూట్ లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. ఈ ఫోటోలు చూసిన నెటిజనులు.. చిట్టితల్లి.. ఎంత చక్కగా ఉందో.. చందమామకే నీకు దిష్టి పెడతాడేమో అన్నంత అందంగా ఉన్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక సితార.. తాజాగా మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్‌లో కనిపించింది. ఇక సితార ఎంత మంచి డ్యాన్సరో.. మరోసారి ప్రూవ్ అయ్యింది.