టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న ‘ఆచార్య’. ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా.. మరో జంటగా రామ్ చరణ్ అలాగే పూజా హెగ్డే నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా విడుదలకు కూడా రెడీ అయింది. ఇప్పటికే ఆచార్య నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్, పోస్టర్లు ఈ సినిమా పై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. జాగా ఈ సినిమా నుంచి మరో బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో సిద్ధార్థ సాగా గా నటిస్తున్న రామ్ చరణ్ టీజర్ ను విడుదల చేసింది చిత్ర బృందం. చరణ్ సరికొత్త క్యారెక్టర్లో డిఫరెంట్ గెటప్‌లో కనిపించి ఆకట్టుకున్నాడు. ఆర్ఆర్లో వచ్చే శ్లోకంతో సిద్ధ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేశారు. ‘ధర్మస్థలికి ఆపదొస్తే.. అది జయించడానికి అమ్మోరు తల్లే మాలో ఆవహించి ముందుకుపంపుద్ది’ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. ప్రేమతో పాటు చరణ్ ఫైట్ చేయడం చూపించారు. ప్రేయసితో సరసాలు, మల్ల యుద్ధంలో పోరాటాలు... రెండిటినీ లింక్ చేయడం బావుంది. టీజర్ చివరలో సిద్ధ మావోయిస్టుగా మారినట్టూ చూపించారు. ఒకరిని చంపినట్టూ చూపించారు. మొత్తానికి ఈ సినిమాకు సంబంధించిన చాలా విషయాలు పొందుపరిచారు దర్శకుడు కొరటాల శివ. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నిరంజన్ రెడ్డి, రామ్ చరణ్ సినిమాను నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.