సాధారణ ప్రయాణికుల రవాణలో ముఖ్యమైనది బస్సు రవాణ. ప్రయాణికులను వారి వారి గమ్యస్థానాలకు చేరవేయడంలో బస్సు లది కీలక పాత్ర. అందుకే అంటారు..'ఆర్టీసీ ప్రయాణం సురక్షితం, సుఖమయం' అని. అయితే ఆగస్టు 15 సందర్భంగా ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. కళ్లు చెదిరే ఆఫర్స్ ను ప్రయాణికులకు అందించనుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే.. గత కొంత కాలంగా తెలంగాణ ఆర్టీసీ నష్టాలలో కొనసాగుతోంది. అయినప్పటికీ ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నడుపుతోంది. సంస్థ నష్టాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పటికి ప్రయాణికులకు రాయితిలు కల్పిస్తూనే ఉంది. ఆర్టీసీ MDగా వీసీ సజ్జనార్ నియమితులైనప్పటి నుంచి కీలక నిర్ణయాలు తీసుకుంటూ సంస్థను ముందుకు తీసుకెళ్తున్నారు. అందులో భాగంగానే ఆర్టీసీ లో కార్గో సేవలను ప్రారంభించి సంచలనం సృష్టించారు. మరోసారి ప్రయాణికులకు స్వాతంత్య్ర దినోత్సవం, ఆజాదీ కా అమృతోత్సవ్ సందర్భంగా ఆర్టీసీ సరికొత్త ఆఫర్లను ప్రయాణికులకు అందించేందుకు ముందుకు వచ్చింది. ఆగస్టు 15 సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు ప్రకటించిన ఆఫర్ల వివరాలు.. ఈ ఆగస్టు 15న జన్మించిన పిల్లలకి వారికి 12ఏళ్లు వచ్చే వరకు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. రాబోయే ఆగస్టు 15 నాటికి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారందరు ఆ రోజు ఫ్రీగా ఆర్టీసీ బస్సుల్లో తిరగవచ్చు. అదీ కాక టీ-24 టికెట్ ను ఆ రోజు రూ. 75 రూపాయలకే పొందవచ్చు. టీటీడీ ప్యాకేజీ ఉపయోగించే ప్రయాణికులకు ఈనెల 16 నుంచి 21 వరకు రూ.75 రూపాయలు తగ్గనున్నాయి. కార్గో సేవల్లో భాగంగా కేజీ బరువులోపు ఉన్న వస్తువులను 75 కి.మీ వరకు ఉచితంగా చేరవేస్తారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు పుష్పక్ ఎయిర్ పోర్ట్ లైనర్ వాడుకుంటే టికెట్ ధరలో ఆ ఒక్క రోజు 25 శాతం రాయితి పొందుతారు. 75 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్లకు తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో ఆగస్టు 15 నుంచి 22వ తేదీ వరకు ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహిస్తారు. 75 ఏళ్లలోపు వారికి రూ.750 రూపాయలకే మెడికల్ టెస్టుల ప్యాకేజీని పెట్టారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఆర్టీసీకి చెందిన అన్ని ప్రాంతాల్లోప్రతీ రోజు ఉదయం 11గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించనున్నారు. ఆగస్టు 13 నుంచి15వ తేదీ వరకు అన్ని ఆర్టీసీ బస్సులకు జాతీయ జెండాను ఏర్పాటు చేయనున్నారు. ఉద్యోగులంతా ఆజాదీ కా అమృతోత్సవ్ బ్యాడ్జీలతోనే విధులకు రావాలని యాజమాన్యం ఆదేశించింది. ఈ ఆఫర్లను ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ లు సంయుక్త ప్రకటనలో తెలిపారు. అలాగే ఈ సదుపాయాలను ప్రయాణికులు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. మరి ఆర్టీసీ ఇలాంటి అద్భుతమైన ఆఫర్లను ఇవ్వడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Come Let's celebrate #AzadiKaAmritMahotsav with #TSRTC #75thIndependenceDay Special Buses rolling out on roads from today #HarGharTiranga pic.twitter.com/kmZ1SUt19E — Managing Director - TSRTC (@tsrtcmdoffice) August 8, 2022 ఇదీ చదవండి: తెలుగు యువకుడి ప్రతిభ.. ఇంటెల్ లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో కొలువు! ఇదీ చదవండి: వీడియో: డీజే వ్యాన్ పైకెక్కి డ్యాన్స్ చేసిన యువకుడు! ఇంతలోనే..