రియల్‌మీ.. చౌకైన 5జీ స్మార్ట్‌ఫోన్ ను భారత్‌లో లాంచ్ చేసింది. రియల్‌మీ 9ఐ 5జీ పేరుతో ఈ మొబైల్ గురువారం విడుదలైంది. ఇప్పటికే 9ఐ 4జీ అందుబాటులో ఉండగా.. దేశంలో 5జీ సేవలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో 9ఐకి 5జీ వెర్షన్ ఫోన్‌ను తీసుకొచ్చింది. 90Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ హెచ్‌డీ, 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా ఉన్న ఈ మొబైల్ రూ.15వేలలోపు ధరతో వచ్చింది. మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్ పై ఈ ఫోన్ రన్ అవుతుంది. రియల్‌మీ 9ఐ ధర, ఆఫర్ 4జీబీ +64 జీబీ వేరియంట్ ధర రూ. 14,999. 6జీబీ +128 జీబీ వేరియంట్ ధర రూ. 16,999 ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అధికారిక వెబ్‌సైట్ Realme.comలో ఈ 5జీ మొబైల్ సేల్‌కు వస్తుంది. మెటాలికా గోల్డ్, రాకింగ్ బ్లాక్, సౌల్‌ఫుల్ బ్లూ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్ పొందవచ్చు.అలాగే.. రియల్‌మీ వెబ్‌సైట్‌లో ఐసీఐసీఐ క్రెడిట్/డెబిట్ కార్డ్‌పై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఈ ఆఫర్‌ను వినియోగించుకుంటే రియల్‌మీ 9ఐ బేస్ మోడల్‌ను రూ.13,999కే సొంతం చేసుకోవచ్చు. Realme 9i 5G Price And Offer pic.twitter.com/H17gB0pzX2 — Govardhan Reddy (@gova3555) August 18, 2022 స్పెసిఫికేషన్స్: 6.6 ఇంచుల ఫుల్ హెచ్‌డీ+ LCD డిస్‌ప్లే మీడియాటెక్ డైమన్సిటీ 810 ప్రాసెసర్ 2,400×1,800 పిక్సెల్స్ రిజల్యూషన్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ రిజల్యూషన్ 90 హెర్జ్ రీఫ్రెష్ రేటు వెనుక వైపు మూడు కెమెరాలు(50ఎంపీ +2ఎంపీ + 2ఎంపీ) సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ 18 వాట్ చార్జర్ ఆండ్రాయిడ్ 12 Realme 9i 5G Price And Specifications pic.twitter.com/MiYWfWgXdg — Govardhan Reddy (@gova3555) August 18, 2022