Oukitel WP19: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ ఔకిటెల్, గ్లోబల్‌గా సరికొత్త స్మార్ట్‌ఫోన్ ను విడుదల చేసింది. 'ఔకిటెల్ డబ్ల్యూపీ19' పేరుతో ప్రపంచంలోనే అత్యంత సామర్థ్యం కలిగిన 21000ఎంఏహెచ్ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. అలాగే.. నాణ్యతలో కూడా ఎక్కడ రాజీపడలేదు. మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్, 64 మెగా పిక్సల్ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్స్350 నైట్ విజన్ కెమెరా వంటి అధునాతన ఫీచర్స్ అందించారు. 'ఔకిటెల్ డబ్ల్యూపీ19' లాంచింగ్ సందర్బంగా ప్రత్యేక డిస్కౌంట్ ప్రకటించారు. అసలు ధర రూ. రూ.82,510 కాగా, 71% తగ్గింపుతో కేవలం రూ.23,927కు అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఆగస్టు 26 వరకు మాత్రమే. కొనుగోలు చేయాలనుకున్నవారు AliExpress ద్వారా కొనుగోలు చేయవచ్చు. 'ఔకిటెల్ డబ్ల్యూపీ19' ప్రత్యేకత: కఠినమైన అవుట్‌డోర్ పరిస్థితులను తట్టుకునేలా దీన్ని రూపొందించారు. సాహస ప్రియులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఫోన్ యొక్క హైలైట్ ఫీచర్ బ్యాటరీ సామర్థ్యం.. 21000mAh బ్యాటరీ. ఇది ఫోన్‌ను అడవిలో ఉన్నా ఒక వారం పాటు కొనసాగించగలదు. ఒక ఫుల్ ఛార్జ్‌పై 7 రోజుల బ్యాకప్ అందిస్తుంది. అలాగే.. 33వాట్ ఫాస్ట్ ఛార్జర్‌కు చేయనుంది. 80% ఛార్జ్ చేయడానికి దాదాపు 3 గంటల సమయం పడుతుంది. అంతేకాకుండా, రివర్స్ ఛార్జింగ్ ఫంక్షన్‌తో, ఫోన్‌ను సులభంగా మినీ పవర్ బ్యాంక్‌గా మార్చొచ్చు. చూడడానికి సాధారణ ఫోన్ లా కనిపిస్తున్నా, ఈ ఫోన్ చాలా బలంగా, మన్నికగా ఉంటుంది. స్పెసిఫికేషన్స్: 6.79 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్‌ప్లే విత్ 90 Hz రిఫ్రెష్ రేట్ మీడియాటెక్ హీలియో జీ95 ప్రాసెసర్ 8జీబీ +256జీబీ స్టోరేజ్ ట్రిపుల్ కెమెరా సెటప్ 64 మెగా పిక్సల్ శాంసంగ్ ప్రధాన కెమెరా, 20 మెగా పిక్సల్ సోనీ ఐఎంఎక్స్350 నైట్ విజన్ కెమెరా, + 3ఎంపీ కెమెరా సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా వెనుక వైపు 4 ఇన్‌ఫ్రారెడ్ రేడియేషన్ ఎమిటర్స్ 21,000mAh బ్యాటరీ 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ Oukitel WP19 is the world's biggest battery rugged smartphone #Oukitel #ruggedphone https://t.co/ssDRHGQ7ZP pic.twitter.com/Z3OYYLiWQn — Gizinfo.com (@Gizinfo_) August 23, 2022 ఇదీ చదవండి: చీపెస్ట్ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసిన రియల్‌మీ.. ధర, స్పెసిఫికేషన్స్ వివరాలివే..! ఇదీ చదవండి: OnePlus: వన్‌ప్లస్ కొనాలంటే ఇదే మంచి అవకాశం.. 25 శాతం వరకు భారీ డిస్కౌంట్లు!