ఒకప్పుడు వాచ్ అంటే కేవలం సమయం తెలుసుకోవడానికి ఉపయోగించే ఓ వస్తువు. మరి ఇప్పుడు వాచ్ చేయలేని పనంటూ ఏదీ లేదు. మీరు రోజుకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎంతసేపు నడుస్తున్నారు, ఎన్ని క్యాలరీలు ఖర్చు అవుతున్నాయి. ఇలా ప్రతీ విషయాన్ని చెప్పేస్తున్నాయి. అంతేకాదు.. మనకు ఫోన్ వచ్చినా.. వాచ్ లోనే మాట్లాడొచ్చు. ఇదిలా ఉంటే మొదట్లో స్మార్ట్ వాచ్‌ల ధరలు ఎక్కువుగా ఉండేవి. ఎంతలేదన్నా రూ. 20 వేలు ఉండేవి. కానీ ఇప్పుడు.. 2 వేల నుంచి 3 వేల ధరలో అదిరిపోయే స్మార్ట్ వాచ్ మన సొంతం చేసుకోవచ్చు. అలాంటి అద్భుతమైన ఫీచర్లున్న 'ఎక్స్‌టెండ్ టాక్' స్మార్ట్ వాచ్‌ను ప్రముఖ వేరబుల్ తయారీ సంస్థ బోట్ విడుదల చేసింది. ఇందులో బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్ వంటి ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ధర: బోట్ ఎక్స్టెండ్ స్మార్ట్‌వాచ్ అసలు ధర రూ. 7,990కాగా, ప్రారంభ ఆఫర్ కింద రూ.2,999కే అందిస్తోంది. బోట్ అధికారిక వెబ్ సైటుతో పాటు, అమెజాన్ లో అందుబాటులో ఉంది. పిచ్ బ్లాక్, చెర్రీ బ‍్లూసోమ్, టీమ్ గ్రీన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఫీచర్స్: ఐపీ68 రేటింగ్‌తో వచ్చిన ఈ ఎక్సెటెండ్ టాక్ స్మార్ట్ వాచ్‌లో 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అంటే వాచ్ డిస్‌ప్లే ను మీరు 150 రకాల డిస్‌ప్లే స్టైల్స్‌ను మార్చుకోవచ్చు. 1.69 ఇంచెస్ స్క్వేర్ డిస్‌ప్లేతో దీన్ని రూపొందించారు. హార్ట్ రేట్ సెన్సార్‌లు, పల్స్ రేట్ ఎలా ఉందో చెక్ చేసే ఆక్సో మీటర్(ఎస్‌పీ ఓ2 మానిటర్).. లాంటి హెల్త్ మానిటరింగ్ ఫీచర్స్. రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్మింగ్.. లాంటి స్పోర్ట్స్ మోడ్స్ ఫీచర్స్ ఉన్నాయి. ఆటో వర్కౌట్ డిటెక్షన్ ఫీచర్ దీంట్లో మరో ప్రత్యేకత. ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ టైం 10 రోజులు ఉంటుందని కంపెనీ తెలిపింది. అయితే.. బ్లూటూత్ కాలింగ్ యూజ్ చేస్తే పవర్ కెపాసిటీ 2 రోజుల వరకే ఉంటుందని కంపెనీ పేర్కొంది. boAt Xtend Smartwatch with Alexa Built-in Rs. 2,999 Only pic.twitter.com/CRBvcrLYIG — Govardhan Reddy (@gova3555) August 29, 2022 ఇదీ చదవండి: Samsung Galaxy S23: రాబోయే శాంసంగ్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ఇదే.. 200MP కెమెరా సెటప్! ఇదీ చదవండి: ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాటరీ ఫోన్.. ఏకంగా 21000mAh బ్యాటరీ!