టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లీ చాలా కాలం తర్వాత ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఫామ్ లేమితో విమర్శలు ఎదుర్కొంటున్న కోహ్లీకి ఈ ఇన్నింగ్స్ కొంత ఊరటనిస్తుంది. ఆసియా కప్‌లో భాగంగా బుధవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 40 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. 44 బంతులు ఎదుర్కొని ఒక ఫోర్, మూడు భారీ సిక్సులతో 59 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌తో కోహ్లీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నా.. కొంత స్లోగా ఆడాడని, హాఫ్ సెంచరీకి ఎక్కువ బంతులు తీసుకున్నాడంటూ కొంతమంది క్రికెట్ అభిమానులు పేర్కొంటున్నారు. అది నిజమే అయినా.. పిచ్ పరిస్థితితులు, రోహిత్ త్వరగా అవుట్ అవ్వడంతో కోహ్లీ కాస్త నెమ్మదిగా ఆడాడు. కానీ.. చాలా కాలం ఫామ్‌లో లేని కోహ్లీ ఈ ఇన్నింగ్స్‌లో మాత్రం పర్ఫెక్ట్ షాట్లతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించాడు. పైగా.. ఈ హాఫ్ సెంచరీతో కోహ్లీ వరల్డ్ రికార్డును సాధించాడు. టీ20ల్లో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. హాంకాంగ్‌పై చేసిన అర్దసెంచరీ కోహ్లీ 31వ హాఫ్ సెంచరీ.. అలాగే 50 ప్లస్ పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా కోహ్లీ టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి అగ్రస్థానంలో నిలిచాడు. ఇలా ఆడక ఆడక ఒక మంచి ఇన్నింగ్స్ ఆడితే.. అది కూడా ప్రపంచ రికార్డు సృష్టించింది. దీన్ని బట్టి కోహ్లీ ఎంతటి దిగ్గజ ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఆశ్చర్యకరంగా విరాట్ తన హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోలేదు. అర్ధసెంచరీ పూర్తి అయినా కూడా బ్యాట్‌ను ఎత్తలేదు. మంచి నీళ్ల ప్రాయంలా సెంచరీలు బాదిన కోహ్లీకి ఇది చాలా చిన్న ఇన్నింగ్సే.. అయినా చాలా కాలంగా కోహ్లీ రన్స్చేయకపోవడంతో క్రికెట్ అభిమానులకు మాత్రం ఇది కాస్త ప్రత్యేకంగా అనిపించింది. ఇక హాంకాంగ్ లాంటి చిన్న టీమ్‌పై, అది కూడా బాగా టైమ్ తీసుకుని ఆడిన ఇన్నింగ్స్ కావడంతో కోహ్లీ దాన్ని సెలబ్రేట్ చేసుకోలేదని సమాచారం. కానీ.. కోహ్లీ హాఫ్ సెంచరీని సెలబ్రేట్ చేసుకోకపోవడంపై మాత్రం అతని ఫ్యాన్స్ ఆవేదనకు గురయ్యారు. కోహ్లీ పరుగులు చేయాలని ఎంత కసిగా ఉన్నాడో హాంకాంగ్‌తో మ్యాచ్ చూస్తే అర్థమవుతుందంటూ సోషల్ మీడియాలో కోహ్లీ ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఏది ఏమైనా.. కోహ్లీ బ్యాట్ నుంచి షాట్లు, ఒక హాఫ్ సెంచరీ రావడంపై ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోర్ చేసింది. సూర్యకుమార్ యాదవ్(68 నాటౌట్), విరాట్ కోహ్లీ(59 నాటౌట్) రాణించారు. హాంకాంగ్ బౌలర్లలో ఆయూష్ శుక్లా, మొహమ్మద్ ఘజాన్ఫర్ ఒక్కొ వికెట్ తీసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసి 40 పరుగుల తేడాతో ఓడిపోయింది. భారత బౌలర్లలో భువనేశ్వర్, అర్షదీప్, ఆవేశ్ ఖాన్, జడేజా తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంతో టీమిండియా ఆసియా కప్‌లో సూపర్ ఫోర్కే చేరింది. ఇక గ్రూప్ ఏ లో పాకిస్థాన్, హాంకాంగ్ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సూపర్ ఫోర్కు చేరుతుంది. మరి ఈ మ్యాచ్‌లో కోహ్లీ ఇన్నింగ్స్‌పై, అతను హాఫ్ సెంచరీ సెలబ్రేట్ చేసుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: టీమిండియాపై మా ఓటమికి అదే కారణం: హాంకాంగ్ కెప్టెన్ for @imVkohli A well made half-century for Virat Kohli. His 31st in T20Is. Live - https://t.co/k9H9a0e758 #INDvHK #AsiaCup2022 pic.twitter.com/QeZsANLiFq — BCCI (@BCCI) August 31, 2022 50* for #ViratKohli 31st T20 Half Century for King pic.twitter.com/5XOBXqthL4 — Thyview (@Thyview) August 31, 2022 A fine half-century for Virat Kohli #INDvHK | #AsiaCup2022 | Scorecard: https://t.co/4PnOYdeR6H pic.twitter.com/RJC6R5ASto — ICC (@ICC) August 31, 2022 HALF CENTURY FOR VIRAT KOHLI pic.twitter.com/3KnaM6irg3 — Kaya - India won again (@kayaaaaa00) August 31, 2022