పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా అద్భుత విజయం సాధించింది. చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో భారత్ పైచేయి సాధించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో టీమిండియా వన్డే సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక మంగళవారం జరిగే మూడో వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని ధావన్ చేసిన గట్టి పట్టుదలతో ఉంది. కాగా.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ టీమిండియా ముందు 312 పరుగుల భారీ టార్గెట్‌ను ఉంచింది. విండీస్ ఓపెనర్ హోప్ (115) సెంచరీకి తోటు, కెప్టెన్ నికోలస్ పూరన్(74) హాఫ్ సెంచరీతో చెలరేగడంతో వెస్టిండీస్ భారీ స్కోర్ సాధించింది. తొలి మ్యాచ్‌లో లానే ఈ మ్యాచ్‌లోనూ భారత్ బౌలర్లు వెస్టిండీస్‌వి ఆరు వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. 312 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ధావన్(13), సూర్యకుమార్ యాదవ్(9) పరుగులకే అవుట్ అయ్యారు. శుభ్‌మన్ గిల్(43)లో పర్వాలేదనిపించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్(54) విండీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ 101 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయం వైపు నడిపించారు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ 63 పరుగులు చేసి జోసెఫ్ బౌలింగ్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మ్యాచ్‌ను గెలిపించే బాధ్యత సంజూ శాంసన్‌పై పడింది. అయ్యర్ అవుట్ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన దీపక్ హుడాతో కలిసి సంజూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. కానీ.. షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 39వ ఓవర్ నాలుగో బంతిని సంజూ షార్ట్ ఫైన్‌లెగ్ వైపు ఆడాడు. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న కైల్ మేయర్స్ చేతుల్లోకి బంతి వేగంగా వెళ్లింది. అయినా కూడా నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న దీపక్ హుడా సింగిల్ కోసం కాల్ చేశాడు. బంతిని అందుకున్న కైల్ వేగంగా బౌలర్ ఎండ్‌కు బంతిని విసిరాడు. దాన్ని అందుకోవండంలో షెఫర్డ్ విఫలం అయినా.. బంతి వెళ్లి వికెట్లకు తాకింది. అప్పటికీ సంజూ క్రీజ్‌కు చాలా దూరంలో ఉన్నాడు. దీంతో భారత్ ఎంతో కీలకమైన సంజూ వికెట్‌ను కోల్పోయింది. దీంతో టీమిండియా ఈ మ్యాచ్‌పై ఆశలు వదులుకుంది. అక్షర్ పటేల్ రాణించడంతో భారత్ మ్యాచ్ గెలిచింది. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేంది. ఇక చాలా రోజుల తర్వాత మంచి టచ్‌లో కనిపించి.. హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్న సంజూ శాంసన్‌ను రాంగ్‌కాల్‌తో రనౌట్ చేయించిన దీపక్ హుడాపై సంజూ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న నీకు బాల్ ఫీల్డర్ చేతుల్లో ఉన్న విషయం అర్థం కాలేదా? అసలు నీకు కళ్లు కనిపించవా’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫైర్ అవుతున్నారు. మ్యాచ్ మంచి దశలో ఉన్న టైమ్‌లో రాంగ్‌కాల్‌తో ఫామ్‌లో ఉన్న బ్యాటర్‌ను అవుట్ చేయడం ఎంతో పెద్ద తప్పో మ్యాచ్ ఓడిపోయి ఉంటే హుడాకు అర్థం అయి ఉండేదని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. సంజూ కాబట్టి ఆ సమయంలో నిశ్శబ్దంగా వెళ్లిపోయాడని హార్థిక్ పాండ్యానో, జడేజానో ఉండి ఉంటే హుడా చేవులు మూసుకోవాల్సి వచ్చేదని సంజూ ఫ్యాన్స్ అంటున్నారు. కాగా ఈ మ్యాచ్‌లో టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించడంతో దీపక్ హుడా చేసిన తప్పు పెద్దగా ఎలివేట్ కాలేదు. లేదంటే మ్యాచ్ ఓటమికి కారణం హుడానే అయ్యేవాడు. మరి సంజూ రనౌట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Sanju Samson had lost his wicket in a run out. If you missed, do watch it here! #WIvIND #sanjusamson pic.twitter.com/H1WvMABQf3 — CBTF Speed News (@cbtfspeednews) July 24, 2022