టీమిండియా టూర్ ఆఫ్ ఐర్లాండ్ 2022లో భాగంగా ఇరు జట్లు రెండు టీ20ల్లో తలపడనున్నాయి. ఈ సిరీస్ కు బీసీసీఐ దాదాపు ఒక కొత్త జట్టును తయారు చేసింది. ఐపీఎల్ 2022లో కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న తొలి సీజన్లోనే గుజరాత్ కు టైటిల్ అందించిన.. హార్దిక్ పాండ్యాకు టీమిండియా పగ్గాలు అప్పగించారు. భువనేశ్వర్ కుమార్ ను వైస్ కెప్టెన్ గా నియమించిన విషయం తెలసిందే. జూన్ 26, 28 తేదీల్లో రెండు టీ20లు జరగనున్నాయి. ఈ సిరీస్ లో రాహుల్ త్రిపాఠికి కూడా అవకాశం కల్పించారు. అయితే టాలెంట్ ఉన్నా టీమిండియాలో అందరికీ అవకాశం దక్కకపోవచ్చు.. కొందరినే అదృష్టం వరిస్తుంటుంది. అలా ఆశపడి భంగపాటుకు గురైన రాహుల్ తెవాటియా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజానికి రాహుల్ తెవాటియా ఎంతో సమర్థవంతమైన టీ20 ప్లేయర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒంటిచేత్తో మ్యాచ్ ని గెలిపించగల సమర్థుడు, గెలిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. క్రీజులో నిల్చుని అలవోకగా సిక్సులు కొట్టగలడు. అవసరమైతే బాల్ తోనూ ప్రదర్శన చేయగలడు. అయితే ఐర్లాండ్ తో సిరీస్ కు దాదాపు కొత్త జట్టును తయారు చేస్తున్న తరుణంలో జట్టులో తనకు తప్పకుండా స్థానం కల్పిస్తారని రాహుల్ తెవాటియా ఆశలు పెట్టుకున్నాడు. NEWS : India’s squad for T20I series against Ireland announced.#TeamIndia — BCCI (@BCCI) June 15, 2022 అయితే జట్టులో అతని పేరు లేకపోవడంతో రాహుల్ తెవాటియా తీవ్ర అసహానికి లోనయ్యాడు. జట్టును ప్రకటించిన తర్వాత తెవాటియా తన ట్విట్టర్ ఖాతాలో స్పందిచాండు. ‘ఎక్స్ పెక్టేషన్స్ హర్ట్స్’ అంటూ ట్వీట్ చేశాడు. అంటే ‘ఆశలు పెట్టుకుంటే చివరకు బాధపడాల్సి వస్తుంది’ అనే అర్థం వచ్చేలా రాహుల్ ట్వీట్ ఉంది. ఇప్పటికే 29లోకి అడుగుపెట్టిన రాహుల్ తెవాటియా ఇప్పటికైనా సెలక్టర్లు తనను ఎంపిక చేస్తారని భావించిన తెవాటియాకి చివరికి మొండిచేయ్యి ఎదురైంది. ఆ అసంతృప్తి, అసహనంతోనే రాహుల్ తెవాటియా ట్వీట్ చేశాడు. Expectations hurts — Rahul Tewatia (@rahultewatia02) June 15, 2022 ఐపీఎల్ కెరీర్ విషయానికి వస్తే.. 2014లో ఐపీఎల్ లో అరంగేట్రం చేసిన రాహుల్ తెవాటియా ఇప్పటివరకు 64 మ్యాచుల్లో 130.39 స్ట్రైక్ రేట్ తో 738 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లోనూ రాహుల్ తెవాటియాకి మంచి రికార్డే ఉంది. మొత్తం 50 ఇన్నింగ్స్ లో బౌలింగ్ చేసిన రాహుల్ తెవాటియా.. 7.92 ఎకానమీతో 32 వికెట్లు పడగొట్టాడు. ఇంక, రాహుల్ తెవాటియా స్పందించిన తీరు చూసి నెటిజన్స్ అతనికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకా అంతా అయిపోలేదు.. నీ పోరాట పటిమను వదులుకోకు అంటూ ధైర్యం చెబుతున్నారు. రాహుల్ తెవాటియాకి టీమిండియాలో స్థానం దక్కకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. They are pumping top-order batsmen without getting rid of old stat padders, it makes no sense. keep shining like a star , you are a champion.#AavaDe pic.twitter.com/NonH7Kul75 — ગુજરાતીમાં (@GujaratiMaa) June 16, 2022 Do you think Rahul Tewatia deserved a chance in the T20I squad for Ireland series?#India #crickettweet pic.twitter.com/mtqGbpTsuK — CricXtasy (@CricXtasy) June 16, 2022 ఇదీ చదవండి: కోట్లు వచ్చే IPL ని కాదని.. దేశం కోసమే నిలిచి.. గెలిచిన బెన్ స్టోక్స్! ఇదీ చదవండి: IPL నుంచి టీమిండియా వరకు రాహుల్ త్రిపాఠి ప్రయాణం..!