ఆసియా కప్ 2022 సూపర్-4 మ్యాచ్ లో భాగంగా భారత్, పాకిస్తాన్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ గెలిచిన సంగతి తెలిసిందే. 20 ఓవర్లకి 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసిన భారత్ పై.. 5 వికెట్ల నష్టానికి 19.5 ఓవర్లలో 182 పరుగులతో పాకిస్తాన్ విజయాన్ని కైవసం చేసుకుంది. అయితే ఈ విజయంలో క్రెడిట్ పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ దే. ఎందుకంటే మ్యాచ్ లో మహ్మద్ హస్నైన్ వేసిన బంతి బౌన్స్ అయ్యి కీపింగ్ చేస్తున్న రిజ్వాన్ తల మీద నుంచి ఎగురుతూ వెనక్కి వెళ్ళిపోయింది. బంతిని ఆపే క్రమంలో గాల్లోకి ఎగిరిన రిజ్వాన్.. బ్యాలన్స్ చేసుకోలేకపోవడంతో అతని మోకాలికి గాయమైంది. దీంతో ఫిజియో సాయం తీసుకుని అలానే కీపింగ్ ని కొనసాగించాడు రిజ్వాన్. ఆ తర్వాత మోకాలి నొప్పితోనే బ్యాటింగ్ ను కొనసాగించి పాక్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులు కొట్టి 71 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు తీసుకున్న రిజ్వాన్.. స్టేడియం నుంచి నేరుగా హాస్పిటల్ కి వెళ్ళిపోయాడు. రిజ్వాన్ మోకాలికి ఎమ్ఐఆర్ స్కాన్ తీసినట్లు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. #AsiaCup2022 #AsiaCupT20l #INDvPAK #INDvsPAK #IndiaVsPakistan @iMRizwanPak to undergo MRI scan for right leg strain #MohammadRizwan was shifted to a hospital soon after #Pakistan's last-over win over #India Details ➡️ https://t.co/WMfcNAkl8i pic.twitter.com/1GFM9gEP91 — TOI Sports (@toisports) September 5, 2022 ఇది కూడా చదవండి: Virat Kohli: కోహ్లీ వికెట్ కోసం రిజ్వాన్ మాస్టర్ ప్లాన్! కంటి చూపుతో లెక్క మార్చేసిన కోహ్లీ! ఇది కూడా చదవండి: Asia Cup 2022: టీమిండియాతో మ్యాచ్ అంటే మాకు భయం లేదు: పాక్ క్రికెటర్ రిజ్వాన్