ప్రపంచంలో అత్యంత సంపన్నపైన క్రికెట్ బోర్డుగా బీసీసీఐ చెలామణి అవుతున్న విషయం అందరకి తెలుసు. మరి అంత డబ్బు సంపాదిస్తున్నప్పుడు.. ఆటగాళ్ల జీతాలు కూడా అదే రేంజులో ఉంటాయని అంతా అనుకోవడం సహజం. అయితే.. ఆటగాళ్ల ప్రదర్శన బట్టి కోటి నుంచి 7 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లిస్తోంది బీసీసీఐ. ప్రస్తుత బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్స్ జాబితాలో 27 మంది క్రికెటర్లు ఉన్నారు. ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి A+, A, B & C.. అను నాలుగు కేటగిరీలుగా విభజించారు. ఏ+ గ్రేడ్ ఆటగాళ్లకు ఏడాదికి రూ.7 కోట్లు, ఏ గ్రేడ్ ప్లేయర్స్‌కు రూ. 5 కోట్లు, బీ గ్రేడ్ ఆటగాళ్లకు రూ.3 కోట్లు, సీ గ్రేడ్ ప్లేయర్లకు కోటి రూపాయాల వేతనం అందుతుంది. ఇక మ్యాచ్ ఫీజులు టెస్టులకు రూ.15 లక్షలు, వన్డేలకు 6 లక్షలు, టీ20లకు రూ.3 లక్షలు ఇస్తున్నారు. ఇక, ఆటగాళ్లు సెంచరీ చేసినా లేదా 5 వికెట్లు తీసినా మరో రూ.5 లక్షలు, డబుల్ సెంచరీ చేస్తే రూ.7 లక్షలు అదనంగా ఇస్తున్నారు. వీటికి ఐపీఎల్ డబ్బులు అదనం. ఆటగాళ్లు - వారి జీతాలు: రూ. 7 కోట్లు: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా. రూ. 5 కోట్లు: కేఎల్ రాహుల్, రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, మహ్మద్ షమీ. రూ. 3 కోట్లు: అజింక్యా రహానే, ఇషాంత్ శర్మ, శార్దూల్ ఠాకూర్, చటేశ్వర్ పుజారా, మహమ్మద్ సిరాజ్, అక్సర్ పటేల్, శ్రేయాస్ అయ్యర్. కోటి రూపాయాలు: శిఖర్ ధావన్, ఉమేశ్ యాదవ్, హార్దిక్ పాండ్యా, శుభ్ మాన్ గిల్, సూర్య కుమార్ యాదవ్, హనుమ విహారి, మయాంక్ అగర్వాల్, వృద్ధిమాన్ సాహా, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చాహల్. ఇది చదవండి: Asia Cup 2022: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్! దాయాదుల పోరు ముందు ఇంత సైలెన్స్ దేనికి? ఇది చదవండి: సెకండ్ ఇన్నింగ్స్ లో నటుడిగా అదరగొడుతున్న మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్!