సౌత్ ఆఫ్రికా టూర్ ఆఫ్ ఇండియా 2022 సీజన్ చాలా అసక్తికరంగా మారుతోంది. 5 టీ20ల సరిసీస్ లో మొదటి రెండు టీ20 మ్యాచుల్లో ఓడిన భారత్.. తర్వాతి రెండు మ్యాచుల్లో వరుస విజయాలు నమోదు చేసింది. శుక్రవారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో 82 పరుగుల ఆధిక్యంతో ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో అవేశ్ ఖాన్ అద్భుతమైన స్పెల్ (4/18)తో సఫారీలను అద్భుంతగా కట్టడి చేశాడు. మొదటి మూడు మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయకపోయినా.. నాలుగో టీ20లో నాలుగు వికెట్లతో రాణించాడు. అంతేకాకుండా ఒకే ఓవర్లో 3 వికెట్లు తీసిన అవేశ్ ఖాన్ టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. 14వ ఓవర్లో ఐదు పరుగులిచ్చి అవేశ్ ఖాన్ 3 వికెట్లు పడగొట్టాడు. అవేశ్ ఖాన్ వేసిన ఆ ఓవర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తన ఈ ప్రదర్శనపై మ్యాచ్ తర్వాత స్పందించాడు.. ‘ఇలాంటి ప్రదర్శన చేయడం ఎంతో సంతోషంగా ఉంది. మా నాన్న పుట్టినరోజు కూడా ఇవ్వాలే. నా ఈ అద్భుతమైన ప్రదర్శనను ఆయనకు అంకితమిస్తున్నా. పిచ్ కాస్త డిఫరెంట్ గా ఉండి.. కొన్నిసార్లు బాల్ బౌన్స్ అయ్యింది. సరైన లెంగ్త్ లో కాస్త్ బౌన్స్ జోడిస్తే బావుంటుందని భావించాను. పంత్ కూడా ఎలాంటి సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. ఆఖరి మ్యాచ్ లోనూ విజయం సాధించేందుకు తప్పకుండా కృషిచేస్తాం’ అంటూ అవేశ్ ఖాన్ చెప్పుకొచ్చాడు. అవేశ్ ఖాన్ ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: తగ్గదేలే అంటున్న దినేష్ కార్తీక్.. ధోనీ రికార్డులు బద్దలు కొట్టేశాడు! ఇదీ చదవండి: దినేష్ కార్తీక్ పై నెటిజన్స్ ప్రశంసలు.. పంత్ ని పక్కన పెట్టాలంటూ..!