టీమిండియా Vs ఇంగ్లాండ్ రీషెడ్యూల్డ్ టెస్టు ఉత్కంఠగా మారింది. భారత్ ఆటగాళ్లు పూర్తి ఆధిపత్యం చలాయిస్తున్నారు. తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా వందలోపే 5 వికెట్లు కోల్పోయిన స్థితి నుంచి పది వికెట్ల నష్టానికి 416 పరుగులు చేసి యావత్ క్రికెట్ ప్రపంచమే నివ్వెరపోయాలా చేశారు. దీనికి పంత్, జడేజా వీరోచిత ఇన్నింగ్సే కారణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. రిషభ్ పంత్ కేవలం 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 146 పరుగులు చేశాడు. టెస్టుని కూడా వన్డే తరహాలో ఆడేశాడు. ఆ తర్వాత రవీంద్ర జడేజా 194 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో 104 పరుగులు చేశాడు. వెరసి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 416 పరుగులు చేసింది. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా మొత్తాన్ని భూమ్ భూమ్ బుమ్రా డామినేట్ చేసేస్తున్నాడు. రెండు సెంచరీలు చేసిన హీరోలను వెనక్కు నెట్టి తన హవా కొనసాగిస్తున్నాడు. కేవలం ఒకే ఒక్క ఓవర్ తో బుమ్రా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెడింగ్ లో నిలిచాడు. అయితే ఆ ఒక్క ఓవర్.. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు వచ్చిన ఓవర్ కావడం కూడా కారణం. కానీ, ఆ ఓవర్ మొత్తం బుమ్రా చేసిన బ్యాటింగ్ డామినేషన్ అందుకు ప్రధాన కారణం. It continues to rain ️ & the Tea has been taken on Day 2 of the Edgbaston Test! Captain @Jaspritbumrah93 leading the charge with the ball for #TeamIndia. #ENGvIND Scorecard ▶️ https://t.co/xOyMtKK7LU pic.twitter.com/qiTcDloaoR — BCCI (@BCCI) July 2, 2022 టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 84వ ఓవర్ వేసేందుకు వచ్చిన స్టువర్ట్ బ్రాడ్‌కు కెప్టెన్ బుమ్రా పట్టపగలే చుక్కులు చూపించాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ ఝడిపిస్తే.. టెస్టుల్లో బుమ్రా వణుకు పుట్టించాడు. ఒకే ఓవర్లో 35 పరుగులు సమర్పించుకుని వైట్ బాల్ లోనూ అత్యధిక పరుగులు ఇచ్చిన చెత్త రికార్డును స్టువర్ట్ బ్రాడ్ మూటగట్టుకున్నాడు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 84 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయింది. The most expensive over in test history. Broad to Bumrah 4, 5wd, 7nb, 4, 4, 4, 6, 1 (35 runs) #ENGvIND pic.twitter.com/5NNZ091IO4 — Doordarshan Sports (@ddsportschannel) July 2, 2022 కెప్టెన్ బుమ్రా బ్యాట్ తోనే కాదు.. అటు బాల్ తోనూ ఇంగ్లాండ్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టేశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్లు అలెక్స్ లీస్, క్రాలే, మూడో స్థానంలో వచ్చిన ఓలీ పోప్ లను పెవిలియన్ కు పంపి.. ఇంగ్లాండ్ ను కట్టడి చేశాడు. షమీ, సిరాజ్ లు చెరో వికెట్ తీశారు. మొత్తానికి చారిత్రక టెస్టులో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఇద్దరు సెంచరీ హీరోలను వెనక్కి నెట్టిన బుమ్రా ఆట తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. The day belongs to Jasprit Bumrah. pic.twitter.com/DXftP09Epe — Mufaddal Vohra (@mufaddal_vohra) July 2, 2022 Jasprit Bumrah was ON today #ENGvIND https://t.co/mSyFrFfRkf pic.twitter.com/YqJl27pq2b — ESPNcricinfo (@ESPNcricinfo) July 2, 2022 We grew up between these two pics #Yuvi #Bumrah pic.twitter.com/jYmdLmoZsh — Kartik choudhary (@KartikRiyar) July 2, 2022 4 5wd 6nb 4 4 4 6 1 Jasprit Bumrah v Stuart Broad – What an over! #WTC23 | #ENGvIND pic.twitter.com/WnGyEBmF0N — ICC (@ICC) July 2, 2022 "Records are meant to be broken." Robin Peterson saw the funny side of the Bumrah Broad contest in Edgbaston! https://t.co/n3Lic7OwWA #ENGvIND | #WTC23 pic.twitter.com/qRdQErRl1v — ICC (@ICC) July 3, 2022 One of the most entertaining overs in Indian test history - Thank you, Bumrah. pic.twitter.com/kqUstkxut6 — Johns. (@CricCrazyJohns) July 2, 2022