క్రికెట్ ఆడి.. ఆడి.. అలిసిపోయిన టీమిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హాలిడే మూడ్‌లోకి వచ్చాడు. కాబోయే భార్యతో కలిసి సాగర తీరాన బీచ్ అందాలు ఆస్వాదిస్తూ ప్రేమలోకంలో విహరిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను అక్షర్ పటేల్ ఫియాన్సీ 'మెహా' తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. అక్షర్‌ను హత్తుకుని ఉన్న ఫొటోలు షేర్ చేస్తూ.. "నువ్వు అలవి కాదు.. ఆ సముద్రంలోని భాగానివి" అంటూ కవితను క్యాప్షన్ జత చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు తెగ వైరలవుతున్నాయి. ఈ ఏడాది జనవరి 20న అక్షర్ పటేల్- మేహా పటేల్‌ల నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. చిన్ననాటి స్నేహితులైన వీరిద్దరూ త్వరలోనే ఒక్కటి కానున్నారు. View this post on Instagram A post shared by Dt.Meha patel (@meha2026) ఇక అక్షర్ క్రికెట్ విషయానికొస్తే.. బౌలింగ్ లోనే కాదు.. బ్యాటింగ్ లోనూ రాణిస్తున్న అక్షర్ టీమిండియా విజయాల్లో కీలక ఆటగాడిగా మారాడు. వెస్టిండీస్ పర్యటనలో అద్భుతంగా రాణించినా అక్షర్ పటేల్‌కు నిరాశే ఎదురైంది. ఈ బౌలింగ్ ఆల్‌రౌండర్‌కు ఆసియా కప్ కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కలేదు. స్టాండ్‌బై ఆటగాడిగా ఎంపిక చేశారు సెలక్టర్లు. కాగా, ఆగష్టు 27 నుంచి యూఏఈ వేదికగా ఆసియా కప్ టోర్నీ ప్రారంభం కానుంది. భారత జట్టు ఆగష్టు 28న దాయాధి జట్టు పాకిస్తాన్ తో తలపడాల్సి ఉంది. Men's #AsiaCup2022 schedule released. India will face Pakistan on 28th August. pic.twitter.com/TiTqVgiUYL — ANI (@ANI) August 2, 2022 ఇదీ చదవండి: అమెరికాలో భారత్-వెస్టిండీస్ మ్యాచ్! అల్లు అర్జున్ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఇదీ చదవండి: Sourav Ganguly: ఉమెన్స్ టీమ్‌పై దాదా అభ్యంతరకర ట్వీట్! నెటిజన్లు ఫైర్