ఇప్పటికే ఇకసారి ఓడించాం.. మరోసారి ఓడించేందుకు హాంకాంగ్‌పై పాకిస్థాన్ గెలవాలని కోరుకున్నాం. కానీ.. తీరా మ్యాచ్ జరిగితే కానీ అర్థం కాలేదు.. టీమిండియాలో ఉన్న మైనస్‌లు ఏంటో! మ్యాచ్ గెలిస్తే లోపాలు కనిపించవు కానీ.. ఓడితే మాత్రం జట్టులో ఎంత డొల్లతనం ఉందో స్పష్టంగా తెలుస్తుంది. ఆసియా కప్ 2022లో భాగంగా ఆదివారం పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పరాజయం పాలైంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ మెరుపు ఆరంభాన్ని అందించారు. ఫోర్లు, సిక్సులతో పవర్‌ప్లేలో రెచ్చిపోయారు. దీంతో టీమిండియా ఐదు ఓవర్లలోపే 50 పరుగులను పూర్తి చేసుకుంది. కానీ.. 16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో భారీ విధ్వంసం సృష్టించేలా కనిపించిన రోహిత్.. షాదాబ్ ఖాన్ వేసిన పవర్‌ప్లే చివరి ఓవర్ తొలి బంతికి నవాజ్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ వెంటనే 20 బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్సులతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించిన రాహుల్ భారీ షాక్‌కు ప్రయత్నించి 7వ ఓవర్ తొలిబంతికి హరిస్ రౌఫ్ బౌలింగ్‌లో కుష్‌దిల్‌షాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఇక్కడి నుంచి టీమిండియా ఇన్నింగ్స్‌ను నడిపే బాధ్యతను విరాట్ కోహ్లీ తన భుజాలపై వేసుకున్నాడు. కానీ అతనికి తోడుగా టీమిండియా మిడిల్డార్ బ్యాటర్లు సహకరించలేకపోయారు. 10 బంతుల్లో రెండు ఫోర్లలో 13 పరుగులు చేసి సూర్యకుమార్ యాదవ్ నవాజ్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్‌గా అవుట్ అయ్యాడు. దీంతో టీమిండియా 91 పరుగులకు మూడో వికెట్ కోల్పోయింది. అయినా ఏం పర్వాలేదు. ఇంకా పంత్, పాండ్యా ఉన్నారన్న ధైర్యం ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌లో కనిపించింది. కానీ.. వారి ఆశలపై నీళ్లు చల్లుతూ.. పంత్ 12 బంతుల్లో 2 ఫోర్లతో 14 పరుగులు చేసి షాదాబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ ఐదో బంతికి అనవరసంగా రివర్స్ స్వీప్ షాట్‌కు ప్రయత్నించి ఆసిఫ్ అలీకి సునాయాసమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా ఎదుర్కొన్న రెండో బంతికే నిర్లక్ష్యంగా చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకుని డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇలా ఈ ఇద్దరూ బ్యాటర్లు చెత్త షాట్లు ఆడి అవుటై.. టీమిండియా భారీ స్కోర్ ఆశలపై దారుణమైన దెబ్బకొట్టారు. రోహిత్-రాహుల్ అందించిన ఆరంభం చూసి 200పై చిలుకు స్కోర్ చేసుకుందనుకున్న భారత్.. మిడిల్డార్ వైఫల్యంతో 181 పరుగులకే సరిపెట్టుకుంది. అది కూడా విరాట్ కోహ్లీ చలవతో వచ్చాయి. తన సీనియారిటీ ప్రదర్శిస్తూ.. కోహ్లీ 44 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 60 పరుగులు చేసి టీమిండియా ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలబడ్డాడు. అద్భుతంగా ఆడుతున్న కోహ్లీకి సహకారం అందించకపోగా చెత్త షాట్లతో అవుటై కెప్టెన్ రోహిత్ శర్మ ఆగ్రహానికి గురైయ్యారు. అవుటై డ్రెస్సింగ్ రూమ్‌కు వచ్చిన పంత్, పాండ్యాకు రోహిత్ గట్టి క్లాస్ పీకాడు. పంత్, పాండ్యాపై రోహిత్ కేకలేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కీలకమైన మ్యాచ్‌లో ఇంత బాధ్యతారహిత్యంతో ఆడతారా అంటూ రోహిత్ శర్మ పాండ్యా, పంత్‌పై మండిపడినట్లు తెలుస్తుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 181 పరుగులు సాధించింది. కోహ్లీ 60 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. పాక్ బౌలర్లలో షాదాబ్ ఖాన్ రెండు, నషీమ్ షా, హూస్నైన్, రౌఫ్, నవాజ్ తలో వికెట్ తీసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని పాక్ 19.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఓపెనర్ మొహమ్మద్ రిజ్వాన్ 51 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 71 పరుగులుచేసి రాణించాడు. నవాజ్ 20 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. చివర్లో ఆసిఫ్ అలీ రెండు ఫోర్లు, ఒక సిక్స్‌తో విలువైన 16 పరుగులు చేశాడు. ఇక భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, అర్షదీప్, భువీ, పాండ్యా, చాహల్ తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో చాహల్, పాండ్యా, భువీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమి, పంత్, పాండ్యా చెత్త షాట్లు, రోహిత్ ఆగ్రహంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: పాక్‌పై టీమిండియా ఓటమికి 5 ప్రధాన కారణాలు! Captain Rohit Sharma wasn't happy with Rishabh Pant and Hardik Pandya's dismissals. : Disney+Hotstar pic.twitter.com/k4QRm3RMpH — CricTracker (@Cricketracker) September 4, 2022 Rohit Sharma's reaction to Asif Ali's dropped catch by Arshdeep Singh #PAKvIND #AsiaCup2022 pic.twitter.com/FfJcP7wbB5 — Cricket Pakistan (@cricketpakcompk) September 4, 2022