ఆసియా కప్ 2022లో హాట్ పేవరేట్‌గా ఉన్న పాకిస్థాన్‌ను అఫ్ఘనిస్థాన్ గడగడలాడించింది. ఫైనల్ రేసులో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో ఆఫ్ఘాన్ అంచనాలకు మించి రాణించింది. తొలుత బ్యాటింగ్ చేసి కేవలం 129 పరుగులు మాత్రమే చేసిన ఆఫ్ఘాన్.. పాకిస్థాన్‌ను అంత ఈజీగా గెలవనివ్వలేదు. చివరి ఓవర్ వరకు ఆఫ్ఘాన్ బౌలర్లు పాక్‌ను వణికించారు. ఆసియా కప్‌లో వరుసగా విఫలం అవుతున్న పాక్ కెప్టెన్ బాబర్ అజమ్ ఈ మ్యాచ్‌లోనూ దారుణంగా విఫలం అయ్యాడు. గోల్డెన్ డక్‌గా తొలి ఓవర్‌లోనే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో పాటు.. పాక్ బ్యాటర్లకు ఆఫ్ఘాన్ బౌలర్లు పరుగులు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. దీంతో ఈజీగా గెలుస్తుందనుకున్న మ్యాచ్‌లో పాకిస్థాన్ చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిచింది. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లు పాకిస్థాన్‌ను అఫ్ఘనిస్థాన్ బెంబేలెత్తించింది. 30 బంతుల్లో 43 పరుగులు అవసరమైన టైమ్‌లో పాకిస్థాన్.. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఉంది. ఈ దశలో మంచి బ్యాటింగ్ డెప్త్ ఉన్న పాకిస్థాన్ ఈజీగా మ్యాచ్ గెలుస్తుందని అంతా భావించారు. కానీ.. ఇక్కడి నుంచి ఆఫ్ఘాన్ అసలు ఆటను ప్రారంభించింది. ఇన్నింగ్స్ 16వ ఓవర్ మూడో బంతికి ఇఫ్తికర్‌ను ఫరీద్ అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే సిక్సర్లతో విరుచుకుపడుతున్న షాదాబ్‌ను రషీద్ ఖాన్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాతి ఓవర్ తొలి బంతికే మొహమ్మద్ నవాజ్‌ను ఫారూఖీ అవుట్ చేశాడు. అదే ఓవర్ చివరి బంతికి కుష్‌దిల్ షా కూడా అవుట్ అవ్వడంతో పాకిస్థాన్ 109 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది. ఇక చివరి 12 బంతుల్లో 21 పరుగులు అవసరమైన టైమ్‌లో ఫరీద్ 19వ ఓవర్‌ను అద్భుతంగా వేశాడు. ఆ ఓవర్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి మరో రెండు వికెట్లు పడగొట్టాడు. దీంతో పాకిస్థాన్ చేతిలో ఒకే ఒక్క వికెట్ ఉంది. కానీ.. 6 బంతుల్లో 11 పరుగులు కావాలి. క్రీజ్‌లో చూస్తే కొత్త కుర్రాడు బ్యాట్ కూడా సరిగ్గా పట్టుకోవడం రాని నసీమ్ షా ఉన్నాడు. అప్పటికే 18వ ఓవర్‌ను అద్భుతంగా వేసిన ఫారూఖీ చివరి ఓవర్ వేసేందుకు వచ్చాడు. దీంతో అఫ్ఘనిస్థాన్ విజయం ఖాయంగా కనిపించింది. కానీ.. అప్పటికే ఇరు దేశాల ఆటగాళ్ల మధ్య కొట్టుకునేంత గొడవ జరగడం, నాలుగు ఓవర్ల నుంచి వికెట్లు, సిక్సులతో మ్యాచ్ థ్రిల్లింగ్‌గా సాగుతుండటంతో ఆటగాళ్లపై తీవ్ర ఒత్తిడి వచ్చేసింది. ఈ ఒత్తిడిలోనే యార్కర్ ప్రయత్నించబోయిన ఫారూఖీ రెండు టాస్ బాల్స్ వేయడంతో.. నసీమ్ షా లడ్డుల్లా దొరికిన ఆ బంతులను అదే రేంజ్‌లో భారీ సిక్సులు బాదడంతో.. మరో 4 బంతులు మిగిలి ఉండగానే పాకిస్థాన్ థ్రిల్లింగ్ విక్టరీ సాధిస్తుంది. చిన్న టోటల్‌ను కాపాడుకునేందుకు ప్రాణం పెట్టిన ఆడిన అఫ్ఘనిస్థాన్.. చివర్లో ఒత్తిడికి చిత్తైంది. దీంతో ఆఫ్ఘాన్ యువ క్రికెటర్లు గ్రౌండ్‌లోనే కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి అద్భుత పోరాట పటిమపై యావత్ క్రికెట్ ప్రపంచం ప్రశంసలు కురిపించినా.. ఆల్‌మోస్ట్ గెలిచి ఓడిపోవడంతో.. ఆ బాధను వారు తట్టుకోలేకపోయారు. ఈ ఓటమితో అఫ్ఘనిస్థాన్‌తో పాటు ఇండియా కూడా ఆసియా కప్‌ను ఇంటికి పోయింది. మరి ఈ మ్యాచ్ ఆఫ్ఘాన్ బౌలర్ల ప్రదర్శనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: వీడియో: మ్యాచ్ తర్వాత స్టేడియంలో పొట్టుపొట్టు కొట్టుకున్న పాక్-ఆఫ్ఘాన్ ఫ్యాన్స్ Brother you’re the best you’re the star ⭐️ I love you ❤️ @fazalfarooqi10 pic.twitter.com/uGpqR4Wm1o — Rahmanullah Gurbaz (@RGurbaz_21) September 7, 2022 "NASEEM SHAH YOU BEAUTY" You don't know how much we needed these two sixes from you Best Match Ever ❤️ Take a Bow Pak vs Afg pic.twitter.com/2fu0stXK87 — Ayaz Ahmed (@Ayaz12ahmed) September 7, 2022 India Afghanistan bye bye #AsiaCup2022 "What a Match" "Congratulations Pakistan" "Remember the Name"#PakvsAfg Unbelievable "Namak Haram"#UrvashiRautela "Asif Ali" "WHAT A WIN" "Umar Gul"#پاکستان_دشمن_ہوا_مسترد#IndianCricketTeam#ChampionsLeague #RohitSharma pic.twitter.com/lByliuMCrL — Talha Aslam Gujjar (@versatiletomat0) September 7, 2022