బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ పార్టీ అధినేత నితీష్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సీఎం పదవికి రాజీనామా చేసి చేసి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. పాట్నాలోని రాజ్ భవన్ లో రాష్ట్ర గవర్నర్ ఫగూ చౌహాన్ ని కలిసిన నితీష్ కుమార్ రాజీనామా లేఖను సమర్పించారు. ఆయన రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ సభ్యులందరి ఏకాభిప్రాయంతోనే ఆయన రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఫామ్ చేసినా సీఎంగా నితీష్ కుమారే ఉంటారని సమాచారం. తనకు ఆర్జేడీ మద్దతు ఇస్తున్నందుకు ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ కు హోం శాఖ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీష్ కుమార్.. ఆ పార్టీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే కొన్ని రోజుల నుండి బీజేపీతో సంబంధాలు సరిగాలేని కారణంగా ఆయన బీజేపీతో తెగదెంపులు చేసేసుకున్నారు. ఇవాళ తన రాజీనామాతో ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేశారు. దీంతో బీజేపీ (77)-జేడీయూ (45) కూటమి పాలన బీహార్ లో ముగిసిపోయింది. మరి నితీష్ కుమార్ రాజీనామాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. #WATCH | Nitish Kumar confirms that he has resigned as Bihar CM pic.twitter.com/Av04rUXojx — ANI (@ANI) August 9, 2022 ఇది కూడా చదవండి: యువతిని వేధించాడంటూ.. మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు శ్రీరాజ్ పై కేసు నమోదు! ఇది కూడా చదవండి: కుప్పం మున్సిపాలిటీకి రూ.66 కోట్ల నిధులు విడుదల చేసిన సీఎం జగన్!