మానవ సంబంధాలు మంట కలుస్తున్నాయి. సమాజంలో అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. వావి వరుసలు మరిచి ఒకరితో ఒకరు అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఈ సంబంధాలే దారుణ హత్యలకు దారి తీస్తున్నాయి. అలా వారి కుటుంబాల్ని చిదిమేస్తున్నాయి. ఈ క్రమంలోనే సుమారు 5 నెలల క్రితం హత్య చేయబడ్డ మహిళ కేసును పోలీసులు ఛేదించారు. తాజాగా ఈ కేసులో విస్తుపోయే నిజాలు బయట పడ్డాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే.. సుమారు 5 నెలల కిందట మైసూరు జిల్లాలోని నంజనగూడు పట్టణంలో జరిగిన వసతి పాఠశాల టీచర్ సులోచన (45) హత్య కేసులో మిస్టరీ వీడిపోయింది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని విషయాల్లోకి వెళితే.. స్థానిక మొరార్జి దేశాయ్ వసతి పాఠశాల హిందీ టీచర్ సులోచన మార్చి నెల 9వ తేదీన దారుణ హత్యకు గురైంది. అప్పటి నుంచి హంతకుల ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే కేసుకు సంబంధించి నలుగురిని పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. సులోచన భర్త నాలుగు సంవత్సరాల క్రితం మృతి చెందాడు. సులోచనకు పెళ్లైన కూతురు, కొడుకూ ఉన్నారు. కొడుకు ఉద్యోగ రీత్యా బెంగళూర్ లో ఉంటాడు. దీంతో ఆమె ఇక్కడ ఒంటరిగానే ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన మురుగేష్ శ్రీకంఠేశ్వర దేవాలయంలో ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. ఇతని భార్య పేరు గాయత్రి. అదే ప్రాంతం కావడంతో గాయత్రి, సులోచనల మధ్య స్నేహం పెరిగింది. ఇదే క్రమంలో మురుగేష్ కు, టీచర్‌కు మధ్య కూడా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. ఈ క్రమంలో వారు ఇద్దరూ కలిసి ఉండడం అనేక సార్లు గాయత్రి చూసింది. తన భర్తను కలవొద్దని గాయత్రి సులోచనను హెచ్చరించింది. అయినప్పటికీ ఆమె తీరు మారలేదు. దీంతో శాశ్వతంగా అడ్డు తొలగించుకోవాలనుకుంది. నంజనగూడులోనే సులోచన నివాసం ఉండేది. దీంతో పథకం ప్రకారం మరో ముగ్గురి సహకారంతో సులోచన ఇంటికి వెళ్లి ఆమెను గొంతు నులిమి చంపి హత్య చేసినట్లు గాయత్రి ఒప్పుకుందని పోలీసులు తెలిపారు. దీంతో గాయత్రి మురుగేశ్, ఆమె బంధువు భాగ్య, నాగమ్మ, కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. మరి ఈ సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: 12 ఏళ్లుగా మహిళ కడుపులో కత్తెర! రూ.లక్షల్లో పరిహారం చెల్లించిన ఆస్పత్రి.. ఇదీ చదవండి: ట్రాక్టర్ నడిపిన పాపానికి ఊరి నుంచి బహిష్కరించారు..!