టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మినిస్టర్ కేటీఆర్ పాలిటిక్స్‌లో ప్రత్యర్థుల మీద రాజకీయ విమర్శలు చేయడంలో ఎంత దూకుడుగా ఉంటారో.. ఆయన దృష్టికి వచ్చిన సమస్యల గురించి కూడా అంతే త్వరగా స్పందిస్తారు. సమస్యలు, విమర్శలనే కాక.. అప్పుడప్పుడు కాస్త ఆసక్తికరమైన అంశాలను కూడా ట్వీట్ చేస్తుంటారు. తాజాగా కేటీఆర్ చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన జనాలు.. కేటీఆర్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. కేటీఆర్ తన ట్విట్టర్ వేదికగా సత్తెమ్మ అనే వ్యక్తిని పరిచయం చేస్తూ.. ఆమెతో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేశారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరలవుతోన్నాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ అభిమాని, సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన జిందం సత్తమ్మ ఫొటోలను మంత్రి కేటీఆర్ తన పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ షేర్ చేశారు. ఆమెను అందరికీ పరిచయం చేస్తూ పలు సందర్భాల్లో ఆమెతో ఉన్న ఫొటోలను ఆయన పోస్ట్ చేశారు. ‘‘నా జిల్లా (సిరిసిల్ల)కు చెందిన ఒక స్పెషల్ టీఆర్ఎస్ సపోర్టర్ ని, కేసీఆర్ హార్డ్ కోర్ అభిమానిని నేను మీకు పరిచయం చేస్తున్నాను. ఆమె జిందం సత్తెమ్మ. ఆమె తెలంగాణ ఆందోళనలో ఎంతో చురుగ్గా పాల్గొన్నారు. నాకు ఎంతో సపోర్ట్ గా ఉంటున్నారు. ఎలాంటి షరతులు లేని ఆప్యాయత, మద్దతు ఎంతో అమూల్యమైనది. ’’ అంటూ ఆమె గురించి రాశారు. ఉద్యమ సమయంలో, ఇంకా పలు సందర్భాల్లో ఆమెతో తను తీసుకున్న ఫొటోలను షేర్ చేశారు. వీటిల్లో కేటీఆర్ సొంత నియోజకవర్గం పర్యటనలో సత్తెమ్మ ఆయన చేతిని పట్టుకొని ఉన్న ఫోటో, కేటీఆర్‌ను ఆలింగనం చేసుకుంటున్న ఫోటో వైరల్ అవుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేటీఆర్ పక్కనే ఉండి విజయ చిహ్నం చూపుతున్న ఫోటోని కూడా మంత్రి ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఇవి తెగ వైరలవుతున్నాయి. ఓ సామాన్య కార్యకర్త ఫోటోలను కేటీఆర్ తన ట్విట్టర్ అకౌంట్లో ప్రత్యేకంగా షేర్ చేయడం నిజంగా గ్రేట్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Let me introduce you to a very special #TRS supporter & a hardcore fan of #KCR Garu from my district; Jindam Sattamma Garu She has been an active part of the #Telangana agitation & continues to be a pillar of support to me Such unconditional affection & support is invaluable pic.twitter.com/tH5YdsgAg5 — KTR (@KTRTRS) July 17, 2022 ఇది కూడా చదవండి: KTR: మంత్రి కేటీఆర్‌ను ఆశ్చర్యపరిచిన వైరల్ వీడియో! ఇది కూడా చదవండి: Letter To Minister KTR: పేద కుటుంబానికి పెద్ద కష్టం.. మా నాన్నని బతికించండి కేటీఆర్ సార్.. వైరలవుతోన్న లేఖ!