గూడ్స్ అండ్ సర్వీస్ టాక్స్(జీఎస్‌టీ)తో కేంద్ర ప్రభుత్వానికి ఒక్క జులై నెలలోనే భారీ ఆదాయం సమకూరింది. రూ.1,48,955 కోట్లు జులై నెలలో కేంద్ర ప్రభుత్వ ఖజానాకు చేరింది. కాగా గతేడాది ఇదే జులై నెలలో వచ్చిన జీఎస్టీ రెవెన్యూ కంటే ఇది 28 శాతం అధికమని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. కాగా.. జూన్ 28 నుంచి 29 వరకు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు రకాల వస్తువులపై కొత్తగా జీఎస్టీ మోపిన విషయం తెలిసిందే. దీంతో ఆయా వస్తువుల ధరలు పెరిగాయి. ఈ ధరల పెరుగుదలతో కేంద్రానికి అధిక ఆదాయం సమకూరింది. జీఎస్టీ కౌన్సిల్ 47వ సమావేశంలో పలు రకాల స్లాబులను సవరించడంతో పాటు కొత్తగా కొన్నిరకాల వస్తు సేవలను జీఎస్టీ పరిధిలోకి తెచ్చారు. వాటిలో ముఖ్యమైనవి.. ప్యాక్ చేసి విక్రయించే ఆహార ఉత్పత్తులు అనగా తినుబండారాలు, అప్పడాలు, జంతికలు, మిక్చర్, ఆటా పిండి, పెరుగుపై జీఎస్టీ విధించారు. అలాగే ఆసుపత్రుల్లో రూ.5,000కు మించిన రూమ్ రెంట్‌పై కొత్తగా 5 శాతం జీఎస్టీ వేశారు. ఇప్పటి వరకు వీటిపై ఎలాంటి జీఎస్టీ లేదు. అలాగే టెట్రా ప్యాక్ లపై 18 శాతం జీఎస్టీ మోపారు. బ్యాంకులు చెక్కుల జారీ కోసం వసూలు చేసే చార్జీపై 18 శాతం జీఎస్టీ వడ్డించారు. మ్యాప్‌లు, చార్ట్‌లు, అట్లాస్‌లపైనా 12 శాతం జీఎస్టీ విధించిన విషయం తెలిసిందే. ఇక ప్రింటింగ్, రైటింగ్, డ్రాయింగ్ ఇంక్.. చాకులు, పేపర్లను కత్తిరించే చాకులు, పెన్సిల్ షార్ప్ నర్లు, ఎల్ఈడీ ల్యాంపులపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచారు. సోలార్ వాటర్ హీటర్లపై ఇప్పటి వరకు 5 శాతం జీఎస్టీ ఉండగా 12 శాతానికి పెంచారు. అంతేకాకుండా రహదారులు, వంతెనలు, రైల్వేలు, మెట్రోలు, అఫ్లూయంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లకు సంబంధించి కాంట్రాక్టు పనులు, శ్మశాన వాటిక సేవలపై 12 శాతం ఉన్న జీఎస్టీని 18 శాతానికి పెంచారు. ఈ పెంచిన జీఎస్టీ జులై నెలలో అమలులోకి రావడంతో.. ఆ నెలలో కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ రెవెన్యూ భారీగా వచ్చిందని ఆర్థిక నిపుణుల తెలుపుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. The gross GST revenue collected in the month of July 2022 is Rs 1,48,995 crores, the second highest ever & 28% higher than the revenues in the same month last year, says Ministry of Finance. — ANI (@ANI) August 1, 2022 ఇది కూడా చదవండి: ఆ 14 వస్తువులను ఇలా కొంటే GST ఉండదు: నిర్మలా సీతారామన్