బాయ్‌కాట్.. ప్రస్తుతం బాలీవుడ్ ఫుల్ ట్రెండింగ్‌లో ఉన్న సబ్జెక్ట్ ఇది. బీటౌన్‌లో వస్తున్న ఎన్నో సినిమాల విషయంలో అక్కడి ప్రేక్షకులు బాయ్‌కాట్ నినాదాలతో నిర్మాతలకు నిద్రలేకుండా చేస్తున్నారు. హీరోలు, హీరోయిన్లు ఎంత మొత్తుకున్నా వినేదేలేదు అంటూ బాయ్‌కాట్ నిరసనలు చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి ఎవరు మద్దతు తెలిపినా వారి సినిమాలు కూడా బాయ్‌కాట్ చేయాలంటూ పిలుపునిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ బాయ్‌కాట్ సెగ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా లైగర్ కు తగిలింది. బాయ్‌కాట్ లైగర్ అంటూ బీ టౌన్‌లో నిరసనలు తెలుపుతున్నారు. అంతేకాకుండా కొందరు తెలుగు వాళ్లు ఈ బాయ్‌కాట్ నిరసనలో భాగంకావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అయితే విజయ్ సినిమాకి ఇలా జరగడానికి ఒకటి కాదు కొన్ని కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. #BoycottLigerMovie Boycott of Karan Johar -Adharma Productions fame #Liger begins Keep supporting & make their woke wish true ! pic.twitter.com/myjEwy29vY — Rohith (@Kuttancp) August 20, 2022 వాటిలో ముఖ్యమైనది లైగర్ సినిమా నిర్మాతలుగా పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్‌తో పాటు కరణ్ జోహార్ కూడా ఉండటం ఈ బాయ్‌కాట్ నిరసనలకు కారణం. కరణ్ జోహార్ నిర్మాతగా ఉన్నాడు కాబట్టి లైగర్ సినిమాను బాయ్‌కాట్ చేయాలంటూ చెబుతున్నారు. ఇంకో కారణం ఏంటంటే.. నార్త్‌లో ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌పై విజయ్ దేవరకొండ కామెంట్స్ చేయడం. It's another Boycott of Bollywood movie Liger which is produced by Karan Johar production. Start your #BoycottBollywood hashtag again #BoycottLigerMovie pic.twitter.com/V3YKinyP8z — Vikas Bal ❤️ (@vikasbal_Bjym) August 20, 2022 “బాయ్‌కాట్ కామెంట్స్ ని పట్టించుకోకూడదు. వాళ్లకి ఎక్కువ అటెన్షన్ ఇవ్వకూడదు. నచ్చిన వాళ్లు థియేటర్లో చూస్తారు. నచ్చని వాళ్లు ఫోన్, టీవీల్లో చూస్తారు. వాళ్లని మనం ఎంగేజ్ చేయలేం.” అంటూ మాట్లాడటం కూడా ఒక కారణం. ఇంకొకటి ఆమీర్‌ఖాన్ లాల్ సింగ్ చడ్డా బాయ్‌కాట్ నిరసనలపై స్పందిస్తూ అలా చేస్తే సినిమాపై ఆధారపడ్డ వాళ్లు ఇబ్బంది పడతారంటూ ఒకరకంగా ఆమీర్‌కు మద్దతు తెలపడం కూడా ఈ బాయ్‌కాట్ లైగర్ కు కారణంగా చెప్పవచ్చు. It's high time that the audience shows them the power of a common man by destroying their attitude & arrogance while seeing their movies as a big flop & a big disaster#VijayDeverakonda #BoycottLigerMovie #BoycottLigerMoviekaranJohar #BoycottLiger CBI Silence Eerie InSSRCase pic.twitter.com/jKFMBzh231 — Shraddha P Gupta (@shraddhaPGupta) August 20, 2022 తెలుగువాళ్లు ఈ బాయ్‌కాట్ ట్రెండ్‌లో పాల్గొనడానికి కూడా ఒక కారణం ఉందంటున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ, అనన్యతో కలిసి మీడియా ప్రతినిధులతో ముచ్చటించాడు. ఆ సమయంలో ఓ రిపోర్టర్ నెర్వస్ గా ఉంటే మనం అంతా ఒకటే అంటూ టేబుల్ కాళ్లు పెట్టుకుని మాట్లాడాడు. దానిని కూడా ఎంతో మంది తప్పుబడుతున్నారు. తర్వాత విజయ్ వివరణ ఇచ్చినా కూడా అంత యాటిట్యూడ్ ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. Every inch of his life is made by himself from many insults and struggles self made Star @TheDeverakonda #Liger pic.twitter.com/7H89BL13W0#BoycottLigerMovie is foolish thing ❌️❌️❌️❌️ — Mike Tyson (@Rgvcultfann) August 20, 2022 అయితే విజయ్ దేవరకొండకు సపోర్ట్ చేసే వాళ్లు కూడా చాలామందే ఉన్నారు. ఐ సపోర్ట్ విజయ్ దేవరకొండ అంటూ ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తున్నారు. అసలు విజయ్ దేవరకొండ ఎవరు? ఎంత కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చాడు అనేది వివరిస్తూ వీడియోలు చేయడం మద్దతు కోరడం, బాయ్‌కాట్ ట్రెండ్ ఆపాలంటూ చెబుతున్నారు. మొత్తానికి కారణం ఏదైనా రౌడీ హీరో సినిమాపై బాయ్‌కాట్ వార్ అనేది జరుగుతోంది. ఆగస్టు 25న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. JOURNEY OF #VijayDeverakonda From a side artist to sensation Doing 1cr budget films to doing 100cr business pic.twitter.com/8KeVShwL7c#BoycottLigerMovie ❌️❌️ — Mike Tyson (@Rgvcultfann) August 20, 2022 You guys think once before doing it!#BoycottLigerMovie ❌️ #VijayDeverakonda #Liger pic.twitter.com/P2RPgoOlcl — 69™❤️ (@TrumpMawa) August 20, 2022 #BoycottLigerMovie #VijayDeverakonda is a self made star and hardworker don't do these type of trends ..... Let him grow bigger .. If the producer is Karan Johar .. why Vijay devarakonda should face problem please stop this pic.twitter.com/WPC5lpU0JJ — Varun Dhawan..... (@Sampath58113772) August 20, 2022 those SSRians just keep in my mind, if you support this tag #BoycottLiger then you killing once again #SushantSinghRajput this is bitter but true, you don't knw struggle behind this man #VijayDeverakonda to reach this position like #SSR did Same! plzz don't #BoycottLigerMovie pic.twitter.com/7uLXIKqOaX — Prince (@iPrinceKumar22) August 20, 2022