Thaman: సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో థమన్ ఒకరు. ఆయన తన మ్యూజిక్‌తో సినిమాలను మరో లెవెల్‌కు తీసుకుపోయి, విజయతీరాలకు చేరుస్తున్నారు. ఆర్డినరీ సినిమాను కూడా తన మ్యూజిక్‌తో ఎక్స్ట్రార్డినరీ చేసేస్తున్నారు. ప్రస్తుతం థమన్ వరుస విజయాలతో.. వరుస ఆఫర్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ఆయన ఈ స్థాయికి చేరుకోవడానికి ప్రత్యక్ష కారణం వాళ్ల అమ్మ సావిత్రి. ఈ విషయాన్ని థమన్ చాలా సందర్భాల్లో చెప్పారు. తాజాగా, తను ఎంతగానో ఆరాధించే తల్లి సావిత్రి పుట్టిన రోజు సందర్భంగా థమన్ ఓ ట్వీట్ చేశారు. అందులో తల్లిపై ఉన్న ప్రేమను చెప్పుకొచ్చారు. ఆ ట్వీట్లో .. ‘‘ అమ్మ 70వ పడిలోకి అడుగుపెట్టింది. 21 ఏళ్ల బాల్యం.. 14 ఏళ్లు భర్తతో.. 35 ఏళ్లుగా నా జీవితం కోసం త్యాగాలు.. నీ కోసం కష్టపడతాను. ఈ జీవితం ఇచ్చినందుకు కృతజ్ఞతలు’’ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఓ వీడియోను షేర్ చేశారు. ‘‘ మాస్ అమ్మ ఈ రోజు ఫుల్ ఫామ్‌లో ఉంది. ఆమె పాడిన ‘మసక మసక ’ సాంగ్ సాయంత్రాన్ని ఎంతో క్రేజీగా మార్చింది. డ్రమ్స్ శివమణి అన్న ఫైర్‌లో ఉన్నారు. పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మా’’ అని పేర్కొన్నారు. థమన్ షేర్ చేసిన వీడియోలో సావిత్రి పాట పాడుతున్నారు. ‘మసక మసక చీకటిలో..’ అంటూ అద్భుతంగా పాట పాడారు. డ్రమ్స్ శివమణి అద్భుతంగా మ్యూజిక్ కొట్టారు. మొత్తానికి థమన్ షేర్ చేసిన వీడియో నెటిజన్లకు బాగా నచ్చింది. మరి, థమన్ తల్లి సావిత్రి పాటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. Amma gaaru turns 70 today ❤️ 21 years of Her Child hood 14 years With Her dear Husband 35 long years of Sacrifice For Me My life and My Career ♥️ Will Work Very hard for U Will try to be on My Super best for U Thanks for giving Me this Life ✊#Amma ♥️ pic.twitter.com/NUK3coHsvR — thaman S (@MusicThaman) August 6, 2022 My Mass Mother in full form today #MasakaMasaka Song her version made the evening go crazy @drumssivamani anna #S70 Many more happy returns #Savithri ❤️ pic.twitter.com/lymkYe62SY — thaman S (@MusicThaman) August 7, 2022 ఇవి కూడా చదవండి : “సీతారామం”లో సీత పాత్రని మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరంటే?