టాలీవుడ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన తాజా చిత్రం 'లైగర్'. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా.. ఆగష్టు 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. అయితే.. సినిమా రిలీజ్ దగ్గరపడటంతో చిత్రబృందం అంతా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయారు. అందులోనూ పాన్ ఇండియా మూవీగా వివిధ భాషల్లో రిలీజ్ అవుతోంది.. కాబట్టి, అన్ని ఏరియాలను కవర్ చేస్తున్నారు హీరోహీరోయిన్స్, దర్శకనిర్మాతలు. ఈ క్రమంలో తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో ఇంటర్వ్యూలో పాల్గొన్నారు పూరి జగన్నాథ్. ఇక సుకుమార్, పూరిల మధ్య పరిచయం, కెరీర్, సినిమాలు ఇలా అన్ని విషయాలు డిస్కస్ చేశాక.. లైగర్ సినిమా విషయానికి వచ్చారు. అయితే.. పూరి ఇప్పటివరకు గ్యాప్ లేకుండా తీసిన సినిమాల సంగతి పక్కన పెడితే.. తాను రాయడానికి టైం తీసుకొని తీసిన సినిమాలు మాక్సిమమ్ బ్లాక్ బస్టర్ అయ్యాయని చెప్పాడు సుకుమార్. దీంతో లైగర్ సినిమాకు కూడా చాలా టైమ్ పట్టింది.. కనుక సినిమా ఫలితాన్ని అంచనా వేశాడు సుక్కు. సుకుమార్ మాట్లాడుతూ.. "లైగర్ సినిమా బ్లాక్ బస్టర్ అవుద్ది.. ముందే చెప్తున్నా. ఎందుకంటే.. ఇప్పటివరకు మిమ్మల్ని, మీ సినిమాలను గమనిస్తే.. మీరు సినిమా సినిమాకు మధ్య ఎక్కువ టైమ్ తీసుకున్నప్పుడు బెటర్ గా రాస్తారు. అలాగే పోకిరి విషయంలో కూడా ఇదే జరిగింది. అప్పుడు టైమ్ తీసుకున్నారు బ్లాక్ బస్టర్ కొట్టారు. ఇప్పుడు లైగర్ కి చాలా టైమ్ తీసుకున్నారు.. ఇది బ్లాక్ బస్టర్.. రూ. 1000 కోట్లు పక్కా" అని పూరితో అన్నారు. ప్రస్తుతం సుకుమార్ మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరి లైగర్ సినిమాపై సుక్కు వేసిన అంచనా పట్ల మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.