టాలీవుడ్ సినీ పరిశ్రమను వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొద్దిరోజుల క్రితం వేతనాలు పెంచాలి అంటూ సినీ కార్మికులు రెండు రోజుల పాటు షూటింగ్స్ బంద్ చేసిన నేపథ్యంలో ఎట్టకేలకు నిర్మాతలు దిగి వచ్చి వేతనాలు పెంచడానికి సిద్ధమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈసారి నిర్మాతలు షూటింగ్స్ బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. సినిమాల నిర్మాణం ఇబ్బందికరంగా మారిన నేపథ్యంలో తెలుగు సినిమా నిర్మాతల మండలి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఈ మేరకు గిల్డ్ సభ్యులైన నిర్మాతలు శనివారం ప్రత్యేకంగా సమావేశం అయ్యారని టాక్. ఆ సమావేశంలోనే సంచలన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కరోనా పాండెమిక్ తరువాత సినిమాల బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. దానిక తగ్గట్టే నటీనటులు పారితోషికాలు కూడా పెంచేశారు. మరోవైపు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్లు కూడా భారీగా రెమ్యునరేషన్లను పెంచేశారని సమాచారం. ఓవైపు స్టార్ హీరోల నుంచి కింది స్థాయి కూలీ వరకు అందరూ ఒకేసారి పారితోషికాలు పెంచేయడంతో సినిమాలు నిర్మించలేని స్థితిలో ఉన్నామని నిర్మాతలు వాపోతున్నారని తెలిసింది. ఇలాగే ఉంటే పరిస్థితి తమ చేయిదాటిపోతుందని.. ఏదైనా కఠిన నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేయాలని ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా సమస్యలన్నీ ఓ కొలిక్కి వచ్చాకే సినిమాల షూటింగ్లను తిరిగి ప్రారంభిస్తే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. అంత వరకూ కొత్తగా ప్రారంభమయ్యే సినిమాల షూటింగ్లను నిరవధికంగా వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారట.ఆగస్టు 1వ తేదీ నుంచి ఇది అమలులోకి రానుందని తెలిసింది. మరి.. సినిమాల విషయంలో నిర్మాతలు పై కీలక నిర్ణయం తీసుకోనున్నారంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Rashmi Gautam: త్వరలో రష్మీ పెళ్లి..! స్వయంగా ప్రకటించిన స్టార్ యాంకర్! ఇదీ చదవండి: Surya Kiran: హీరోయిన్ కల్యాణితో విడాకులకు కారణం ఏంటో చెప్పిన డైరెక్టర్