సూపర్ స్టార్ మహేశ్ బాబు.. టాలీవుడ్ లో టాప్ హీరోల్లో మహేశ్ ఒకడు. అటు హీరోగానే కాకుండా తన వ్యక్తిత్వంతోనూ ఎంతో అభిమానులను సొంతం చేసుకున్నాడు. చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఎంతో మంది జీవితాల్లో వెలుగు నింపాడు. ఎలాగైతే సూపర్ స్టార్ మహేశ్ హుందాగా ఉంటాడో..తని ఫ్యాన్స్ కూడా అంతే ప్రవర్తిస్తూ ఉంటారు. సినిమా నచ్చితే జే కొడతారు.. లేదంటే సైలెంట్ గా ఉండిపోతారు. ఒకానొక సందర్భంలో మహేశ్ బాబు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించాడు. నా ఫ్యాన్స్ ఎంతో జన్యూన్ గా ఉంటారు. సినిమా నచ్చితే చూస్తారు. లేదంటే నా ఫ్యాన్సే సినిమా చూడరు అంటూ చెప్పుకొచ్చాడు. అయితే గత కొంతకాలంగా మహేశ్ ఫ్యాన్స్ పంథా మారినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కడు, పోకిరి వంటి స్పెషల్ షోలు రావడం, సోషల్ మీడియాలో ఫ్యాన్స్ యాక్టివ్ అవ్వడం అన్నీ చూస్తున్నాం. #Pokiri West Plano Dallas show sold out pic.twitter.com/Tv83GOxnf0 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) August 3, 2022 అయితే దీని వెనుక మహేశ్ ఫ్యాన్స్ భారీ స్కెచ్ ఉందనే చెబుతున్నారు. ప్రస్తుతం మహేశ్- త్రివిక్రమ్ కాంబోలో సినిమా రాబోతోంది. ఆ తర్వాత రాజమౌళితో సినిమా చేస్తానని ఇప్పటికే ప్రకటించారు. అంటే త్రివిక్రమ్ సినిమా తర్వాత మళ్లీ దాదాపు రెండేళ్ల వరకు మహేశ్ సినిమా వచ్చే అవకాశం లేదు. ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ లో మూడ్ ఛేంజ్ కాకుండా ఇప్పటి నుంచే వారిని యాక్టివ్ గా ఉంచేందుకు.. ఇండస్ట్రీలోనూ మహేశ్ పేరు మారు మ్రోగేందుకు ఫ్యాన్స్ భారీ స్కెచ్చే ప్లాన్ చేశారు. Super @urstrulyMahesh ❤️#SitaraGhattamaneni #MaheshBabu pic.twitter.com/H3BGzGoFjz — Mahesh Babu Space (@SSMBSpace) August 2, 2022 అంతేకాకుండా రాజమౌళితో సినిమా అంటే పాన్ ఇండియా లెవల్లే మహేశ్ కు క్రేజ్ ఉండాలి. అంటే వీళ్లు ఇప్పటి నుంచి మహేశ్ క్రేజ్ ని సోషల్ మీడియాలో సైతం విస్తృతంగా తీసుకెళ్లాలి. ఇలాంటి కారణాల వల్లే ఎన్నడూ లేనిది మహేశ్ ఫ్యాన్స్ ఈ రేంజ్ లో స్పెషల్ షోలు, సోషల్ మీడియా ప్రచారాలు అన్నీ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరి మహేశ్ ఫ్యాన్స్ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #Mummidivaram pokiri spcl show confirmed we will inform more details soon Stay tuned us⏳@ViswaCM1 #PokiriSpecialshow #MaheshBabu pic.twitter.com/wZgxEe754m — Mummidivaram_MBFC (@MmdMaheshFC) August 2, 2022 ఇదీ చదవండి: కంఠమనేని ఉమా మహేశ్వరీకి బాలకృష్ణ కన్నీటి వీడ్కోలు! ఇదీ చదవండి: ప్రభాస్ ఆదిపురుష్ లో రామ్ చరణ్ గెస్ట్ రోల్!