మెగా బ్రదర్ నాగబాబు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సినిమాలు, రాజకీయాలు అంటూ ఫుల్ బిజీగా ఉంటారు. ఇక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్‌గా ఉంటారు. వృత్తి, వ్యక్తిగత అంశాలకు సంబంధించిన అంశాలను షేర్ చేస్తుంటారు. ఇక నాగబాబు కొన్నేళ్ల క్రితం వరకు కూడా జబర్దస్త్ షోకి జడ్జీగా వ్యవహరించేవాడు. అయితే ఆ తర్వాత ఆయన షో నుంచి బయటకు వెళ్లాడు. ఇక ఆయన జడ్జీగా ఉన్న సమయంలో ఆర్టిస్ట్‌లకు ఎలాంటి కష్టం వచ్చినా ముందుండి ఆదుకువాడని.. వారి సమస్యలపై స్పందించేవాడని ఇప్పటికే పలు సందర్భాల్లో పలువురు ఆర్టిస్ట్‌లు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కిరాక్ ఆర్పీ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు. నాగబాబుది ఎంతటి గొప్ప మనసో.. ఆర్టిస్ట్‌ల గురించి ఎంత కేర్ తీసుకుంటారో తెలియజేశాడు. ఈ క్రమంలో పంచ్ ప్రసాద్ అనారోగ్యం బారిన పడ్డప్పుడు నాగబాబు ఎలా ముందుకు వచ్చి సాయం చేశాడో సుమన్ టీవీకిచ్చిన ఇంటర్వ్యూలో ఆర్పీ వివరించాడు. ఈ సందర్భంగా ఆర్పీ మాట్లాడుతూ.. ‘‘పంచ్ ప్రసాద్‌కు కిడ్నీ ప్రాబ్లమ్ వచ్చింది. డయాలసిస్ చేస్తున్నారు. ఆ విషయం ముందు మాకు ఎవ్వరికి తెలియదు. ఓ రోజు కాల్ చేస్తే స్టార్ హాస్పిటల్లో ఉన్నాను అన్నాడు. వెళ్లి చూసేసరికి బెడ్ మీద ఏవేవో వైర్లు తగిలించి ఉన్నాడు. ఏంటన్న అంటే పరిస్థితి చెప్పాడు. వెంటనే ఫోటో తీసి గ్రూప్‌లో పెట్టాను. అది చూసి నాగబాబు మెసేజ్ చేశారు. షూటింగ్ రోజున గంట పాటు మీటింగ్ ఉంటుందని చెప్పారు. వెళ్లాం. పంచ్ ప్రసాద్ పరిస్థితి వివరించి మనం ఏం చేద్దాం అని అడిగారు. ఒక్క రోజు రెమ్యూనరేషన్ ఇద్దాం అని చెప్పారు. ఆయన రెండు లక్షలు ఇచ్చారు. రోజా, అనసూయ లక్ష ఇచ్చారు. అలా అందరి ద్వారా 5-6 లక్షల వరకు పొగు చేసి పంచ్ ప్రసాద్‌కు అందించారు’’ అని చెప్పకొచ్చాడు. ఇది కూడా చదవండి: Kiraak RP: ఆరోజు నేను పిచ్చోడిలా తిరుగుతుంటే నాగబాబు ఫోన్ చేసి..! ‘‘ఆ సమయంలో ప్రసాద్ భార్య గర్భవతి. ఆమె అలా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో నాగబాబు గారు.. ఆమెకు డబ్బులు ఇచ్చి పని మనిషిని పెట్టుకోమని సూచించారు. ఇప్పటికి పంచ్ ప్రసాద్ చికిత్సకు డబ్బులు పంపుతారు. నాగబాబు క్యారెక్టర్ అంత గొప్పది’’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆర్పీ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Kiraak RP: RPతో ప్రేమని ఒప్పుకోవడానికి కారణం చెప్పిన కాబోయే భార్య లక్ష్మీ ప్రసన్న.