కీర్తి సురేశ్.. తెలుగు ప్రేక్షకులకు ఈ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చైల్డ్ యాక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేశ్ ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. నేను శైలజ సినిమాతో తెలుగులో కెరీర్ ప్రారంభించన కీర్తి.. ఆ తర్వాత ఎన్నో హిట్స్ అందుకుంది. ఆ తర్వాత కెరీర్ మందగించిన తరుణంలో మహశ్ తో కలిసి నటించిన ‘సర్కారు వారి పాట’తో మళ్లీ కెరీర్‌లో దూసుకుపోతోంది. ప్రస్తుతం కీర్తి సురేశ్ కెరీర్ గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఓ వార్త ప్రచారంలో ఉంది. అదేంటంటే.. త్వరలోనే ఈ ముద్దుగుమ్మ పెళ్లిపీటలు ఎక్కబోతోందని కోలీవుడ్‌లో ప్రచారం జోరందుకుంది. అదికూడా తల్లిదండ్రులు నిశ్చయించిన వ్యక్తితోనే వివాహం జరగబోతోందని చెబుతున్నారు. అతను ఓ వ్యాపారవేత్తని, రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటాడని టాక్ నడుస్తోంది. హీరోయిన్ల విషయంలో ఇలాంటి గాసిప్స్ రావడం సహజమే. అయితే ఈ వార్తలపై కీర్తి సురేశ్ ఇంకా స్పందించలేదు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ఇంక సినిమా విషయానికి వస్తే.. కీర్తి సురేశ్ చేతిలో మూడు సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తమిళ్‌లో మామన్నన్ అనే సినిమా చిత్రీకరణలో ఉంది. తెలుగులో నాచురల్ స్టార్ నాని సరసన దసరా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంటోంది. ఇంక మెగాస్టార్ చిరంజీవికి సోదరిగా కీర్తి సురేశ్ భోళా శంకర్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. కీర్తీ సురేశ్ పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) ఇదీ చదవండి: బింబిసార సూపర్ హిట్. కానీ.. Jr.ఎన్టీఆర్ ని ఎందుకు తిడుతున్నారు? ఇదీ చదవండి: వీడియో: తమిళనాడులో పవన్ మీద భక్తితో తమిళ తంబీలు ఏం చేశారంటే?