టాలీవుడ్ లో విభిన్నమైన కథల ఎంపికతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న యంగ్ హీరో నిఖిల్. సినిమాల ఫలితాలతో సంబంధం లేకుండా దూసుకుపోతున్న నిఖిల్.. తాజాగా 'కార్తికేయ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన పాజిటివ్ స్పందన లభించింది. ఫలితంగా మొదటిరోజే రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది కార్తికేయ 2. కృష్ణతత్వానికి అడ్వెంచర్ అంశాలను జోడించి చేసిన ఈ సినిమాను చందూ మొండేటి తెరకెక్కించాడు. సరికొత్త స్టోరీ పాయింట్ తో కంటెంట్ ప్రధానంగా రూపొందించిన ఈ సినిమా.. పాజిటివ్ మౌత్ టాక్ తో పాటు నిఖిల్ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్స్ నమోదు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కార్తికేయ 2 మూవీలో అందరి యాక్టింగ్ తో పాటు విజువల్స్, స్టోరీ లైన్ పై విమర్శకుల ప్రశంసలు కురుస్తున్నాయి. అలాగే సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అయ్యింది. కార్తికేయ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ చూసినట్లయితే.. నైజాం - 1.24 కోట్ల సీడెడ్ - 40 లక్షలు, గుంటూర్ - 44 లక్షలు ఉత్తరాంధ్ర - 45 లక్షలు ఈస్ట్ గోదావరి - 33 లక్షలు వెస్ట్ గోదావరి - 20 లక్షలు కృష్ణ - 27 లక్షలు నెల్లూరు - 17 లక్షలు తెలుగు రాష్ట్రాల్లో 5.30 కోట్ల గ్రాస్, 3.50 కోట్ల షేర్‌ను రాబట్టింది. కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియా - రూ. 25 లక్షలు, ఓవర్సీస్ - రూ. 1.30 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.05 కోట్లు షేర్‌తో పాటు రూ. 8.50 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని సమాచారం. 'కార్తికేయ 2' అంచనాలకు అనుగుణంగానే వరల్డ్ వైడ్ రూ. 12.80 కోట్ల మేర బిజినెస్ జరిగిందని.. దీంతో బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 13.30 కోట్లుగా నమోదైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక మొదటి రోజు రూ. 5.05 కోట్లు రావడంతో.. మరో 8.25 కోట్లు రాబడితే సినిమా క్లీన్ హిట్ గా నిలుస్తుంది. ఈ సినిమాను అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మించారు. మరి కార్తికేయ 2 సినిమా పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Mass Collections #Karthikeya2 #NikhilSiddhartha #AnupamaParameswaran #Karthikeya2onAugust13th Follow us @tollymasti pic.twitter.com/BPpeucnM3F — Tollymasti (@tollymasti) August 14, 2022