గత కొంత కాలంగా జబర్దస్త్ షో చుట్టూ వివాదాలు నడుస్తోన్న సంగతి తెలిసిందే. కమెడియన్ ఆర్పీ.. జబర్దస్త్ షోపై సంచలన ఆరోపణాలు చేశాడు. అక్కడ ఆర్టిస్ట్‌లకు సరైన గౌరవం ఉండదని.. మనుషుల్లానే చూడరని కామెంట్ చేశాడు. అవి కాస్త నెట్టింట వైరల్‌గా మారడంతో.. మిగతా జబర్దస్త్ ఆర్టిస్టులు ఆర్పీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు. హైపర్ ఆది, ఆటో రామ్ ప్రసాద్, షేకింగ్ శేషు వంటి వారు ఆర్పీ వ్యాఖ్యలు అబద్ధం అని చెప్పాగా.. తాజాగా జబర్దస్త్ మాజీ ప్రొడక్షన్ మానేజర్ ఏడుకొండలు ఈ వివాదంపై స్పందించారు. ఆర్పీపై సంచనల వ్యాఖ్యలు చేశారు. అన్నం పెట్టిన వారిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని తెలిపారు.ఇక ఆర్పీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డాడు ఏడుకొండలు. ఆర్పీ ఎలాంటి వాడో చెబుతూ.. గతంలో జరిగిన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు ఏడుకొండలు. జబర్దస్త్‌లో చేసినన్ని రోజులు ఆర్పీకి ఎప్పుడు పేమెంట్ ఆపలేదని.. ఇన్నాళ్లు మాట్లడని ఆర్పీ ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నాడు అని ప్రశ్నించాడు. అసలు ఆర్పీ లాంటి వ్యక్తి శ్యామ్ ప్రసాద్ గురించి మాట్లాడటం ఏంటని మండిపడ్డాడు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ.. ‘‘ఆర్పీ ఓ సినిమా చేస్తున్నప్పుడు నన్ను ఆ సినిమాకు పని చేయమని కోరాడు. 50 వేల జీతం ఇచ్చాడు. సినిమా ప్రారంభం అయినా కొద్ది రోజులు తర్వాత ఆర్పీ తీరు నచ్చక ఈ సినిమా ముందుకు సాగదని అర్థం అయ్యింది. ఇలాంటి సమయంలో ఆర్పీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి చెడుగా మాట్లాడాడు. ఆ మాటలు నాకు నచ్చక.. అక్కడి నుంచి ఆర్పీని మెడ పట్టుకు బయటకు గెంటేశానని’’ తెలిపాడు. ప్రస్తుతం ఏడు కొండలు వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: కిరాక్ ఆర్పీపై ఓ రేంజ్ లో విరుచుకుపడిన జబర్దస్త్ ఏడుకొండలు..! ఇది కూడా చదవండి: సుడిగాలి సుధీర్ కి లైవ్ లో జబర్దస్త్ ఏడుకొండలు కాల్.. మొత్తం బండారం బయటపెట్టేశాడు!