హీరో విశాల్.. కోలీవుడ్‌లోనే కాదు అటు టాలీవుడ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న నటుడు. విశాల్ వ్యక్తిత్వానికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. స్టార్ హీరో హోదా పొందిన తర్వాత కూడా విశాల్ ఎంతో హుందాగా సాధారణ వ్యక్తిగా వ్యవహిస్తుంటాడు. తన సంపాదన నుంచి కూడా ఎంతో కొంత విరాళం, సామాజిక సేవకు ఉపయోగిస్తూ ఉంటాడు. అందుకే విశాల్ అంటే అందరికీ ఎంతో ఇష్టం. ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశాల్ మరోసారి గాయపడినట్లు తెలుస్తోంది. ఒక నెల క్రితమే విశాల్ లాఠీ సినిమా షూటింగ్‌లో ఉండగా గాయపడ్డాడు. అప్పుడు వెంటనే ఆస్పత్రిలే చేరి చికిత్స తీసుకున్న అనంతరం కోలుకున్నాడు. ఇప్పుడు కొత్త సినిమా మార్క్ ఆంటోని చిత్రం షూటింగ్‌లోనూ విశాల్‌కు గాయాలు అయినట్లుగా తెలుస్తోంది. Breaking News !! Our Puratchi Thalapathy #Vishal Anna got severely injured early this morning while filming a rigorous fight sequence for the movie #MarkAntony.@VishalKOfficial @HariKr_official — Vishal Fans 24x7 ™ (@VishalFans24x7) August 11, 2022 గురువారం తెల్లవారుజామున హీరో విశాల్ మార్క్ ఆంటోని సినిమా షూటింగ్‌లో పాల్గొన్నాడు. కీలక ఫైట్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో హీరో విశాల్ తీవ్రంగా గాయపడినట్లు చెబుతున్నార. ఫస్ట్ ఎయిడ్ చేసిన తర్వాత విశాల్ సినిమా షూట్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. విశాల్‌కు గాయాలు కావడంతో మార్క్ ఆంటోని షూటింగ్‌ని నిలిపివేశారు. విశాల్ దాదాపు ప్రతి సినిమాలో గాయాలపాలు అవుతుండటం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అందుకు ప్రధాన కారణం ఏంటంటే విశాల్ డూప్ లేకుండా ఫైట్స్ చేయడమే. డూప్ లేకపోవడం వల్లనే విశాల్ అన్ని సినిమాల షూటింగ్స్ లో గాయాలపాలవుతున్నాడు. ఈ లాఠీ, మార్క్ ఆంటోనినే కాదు.. 2014 నుంచి దాదాపు చేసిన అన్ని సినిమా షూటింగ్స్ లో విశాల్‌కు గాయాలు అయ్యాయి. హీరో విశాల్‌కు గాయాలు కావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. #Vishal injured at #MarkAntony shoot! நேற்று நடந்த படப்பிடிப்பில் ஆக்ஷன் காட்சியில் பங்கேற்ற போது நடிகர் #விஷால் கால் முட்டியில் காயமடைந்தார் Details herehttps://t.co/Zfi1ML7mwF@johnsoncinepro pic.twitter.com/gAGBRvO0Td — Rinku Gupta (@RinkuGupta2012) August 11, 2022 ఇదీ చదవండి: మహిళలకు సినిమా రంగంలో గౌరవం లేదు.. తమన్నా ఆవేదన! ఇదీ చదవండి: ఇమ్మాన్యూయేల్‌పై మరోసారి తన ప్రేమను బయటపెట్టిన వర్ష.. ‘ఇమ్మూ కాదంటే నా ఊపిరి ఆగిపోతుంది’!