గత కొంత కాలంగా సినీ, మోడలింగ్ రంగంలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. బ్రెజిల్ విషాదం చోటు చేసుకుంది. మాజీ మిస్ బ్రెజిల్.. మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కొన్ని యాడ్స్ లో నటిస్తూ బంగారు భవిష్యత్ ని ఊహించుకున్న ప్రముఖ నటి, మోడల్ గ్లెయిసీ కొరియా కన్నుమూశారు. దీంతో మోడలింగ్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్ లో 2018లో మిస్ యునైటెడ్ కాంటినెంట్స్ బ్రెజిల్ కిరీటాన్ని దక్కించుకుంది గ్లెయిసీ కొరియా. ఆ తర్వాత ఈ అమ్మడికి వరుసగా యాడ్స్ లో నటించే ఛాన్స్ వచ్చింది. ఓ వైపు యాడ్స్ లో నటిస్తూనే ఇన్ఫ్లూయెన్సర్గా మారింది. ఈ క్రమంలో ఆమెకు గొంతు టాన్సిల్స్ కావడంతో వాటికి సర్జరీ చేయించుకొని తొలగించుకోవాలనుకుంది. దీనికి సంబంధించిన సాధారణ సర్జరీ అయ్యింది. కానీ ఆ సర్జరీ వికటించడంతో గ్లెయిసీకి తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. అదే సమయంలో ఆమెకు గుండెపోటు రావడంతో కోమాలోకి వెళ్లిపోయింది. రియో డీ జనెరియోకు ఈశాన్యంగా ఉండే మకాయే నగరంలో పుట్టి.. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది గ్లెయిసీ కొరియా. ఈ సందర్భంగా కొరియా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ.. ఆమె మరణం తమ కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేసిందని విలపించారు. కొరియా నవ్వే తమకు గుర్తొస్తుందని తెలిపారు. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.