ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు స్నేహ. అసలు పేరు సుహాసిని రాజారాం నాయుడు. 1981 అక్టోబర్ 12న తెలుగు ఫ్యామిలీలో ముంబైలో జన్మించారు. ‘ఇంగానే ఒరు నిలపక్షి’ అనే మలయాళ సినిమా ద్వారా హీరోయిన్ గా అడుగుపెట్టిన స్నేహ.. ఆ తర్వాత తమిళంలో ఎన్నవలే సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. ఒకప్పటి టాలీవుడ్ లవర్ బాయ్ తరుణ్ నటించిన ‘ప్రియమైన నీకు’ సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పద్ధతిగా, అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే స్నేహ.. తన అందంతో, అభినయంతో మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యారు. తొలివలపు సినిమాలో అమాయకమైన యువతిగా కనిపించి మెప్పించిన స్నేహ.. హనుమాన్ జంక్షన్, వెంకీ, శ్రీరామదాసు వంటి సినిమాల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, రవితేజ వంటి స్టార్ హీరోల సరసన నటించారు. 2011లో వచ్చిన రాజన్న సినిమాలో నటించిన స్నేహ.. ఆ తర్వాత టాలీవుడ్ కి దూరమయ్యారు. 2012 మే 11న చెన్నైలో ప్రసన్న వెంకటేశన్ అనే తమిళ హీరోని వివాహం చేసుకున్నారు. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. 2014లో తెలుగులో ఉలవచారు బిర్యానీతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన స్నేహ.. సన్నాఫ్ సత్యమూర్తి, వినయ విధేయ రామ వంటి సినిమాల్లో కేరెక్టర్ రోల్స్ చేశారు. సినిమాలే కాకుండా బుల్లితెర మీద రియాలిటీ షోస్ లో కూడా హోస్ట్ గా, జడ్జిగా చేశారు. ప్రస్తుత్తం జూనియర్ సూపర్ స్టార్స్ సీజన్ 4 అనే తమిళ టాలెంట్ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఆమె తెలుగు తెరపై కనిపించి మూడేళ్లు అవుతుంది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తెలుగు ప్రేక్షకులని, అభిమానులని ఎంటర్టైన్ చేస్తుంటారు. View this post on Instagram A post shared by Santhosh Master (@iamsanto_master) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) View this post on Instagram A post shared by Sneha (@realactress_sneha) ఇది కూడా చదవండి: Karthikeya 2: ‘కార్తికేయ 2’ ఓటిటి రిలీజ్! స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? ఇది కూడా చదవండి: Krishnam Raju: ఫామ్‌హౌస్‌లోనే కృష్ణంరాజు అంత్యక్రియలు.. అక్కడే ఎందుకంటే?