Bimbisara Collections: కథ ఉంటే చాలు కొత్త డైరెక్టర్ అయినా పర్వాలేదు అనుకున్నారు హీరో కల్యాణ్ రామ్. ‘బింబిసార’ పేరిట పెద్ద సాహసానికి తెరతీశారు. కథను నమ్మి కొత్త డైరెక్టర్ అయిన మల్లిడి వశిష్టకు అవకాశం ఇచ్చారు. తన సొంత బ్యానర్‌లో ‘బింబిసార’ సినిమా తెరకెక్కించారు. 2019నుంచి ఈ సినిమాపై పని చేస్తూ వచ్చారు. ఈ సారి తన కెరీర్‌లోనే బ్లాక్ బాస్టర్ హిట్టుగా నిలిచిన పటాస్ సినిమా కలెక్షన్ల కంటే రెండు రెట్లు ఎక్కువగా బడ్జెట్‌ను పెట్టి సినిమా చేశారు. దాదాపు 40 కోట్ల బడ్జెట్‌తో ‘బింబిసార’ తెరకెక్కింది. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘బింబిసార’ అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. మొదటి రోజే రూ. 6.3 కోట్లు షేర్, రూ. 9.3 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇక, రెండవ రోజు కూడా ‘బింబిసార’ కలెక్షన్ల పరంగా వ్వావ్ అనిపించింది. మొదటి రోజును మించి వసూళ్లను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 19.9 కోట్ల రూపాయల గ్రాస్, 12.14 కోట్ల షేర్ సాధించింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా 16.3 కోట్ల గ్రాస్, 10.7 కోట్ల షేర్ వసూలు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ‘బింబిసార’ కలెక్షన్లు(షేర్) ఇలా.. నైజాం: రూ. 3.87 కోట్లు వైజాగ్ : రూ.1.55కోట్లు సీడెడ్: రూ. 2.20 కోట్లు నెల్లూరు: రూ. 37 లక్షలు గుంటూరు: రూ. 89 లక్షలు కృష్ణా జిల్లా: రూ. 59 లక్షలు తూర్పు గోదావరి: రూ. 70 లక్షలు పశ్చిమ గోదావరి: రూ. 53 లక్షలు యూఎస్‌ఏ : రూ. 80 లక్షలు మిగిలిన ప్రాంతాలు : రూ. 64 లక్షలు