సెలబ్రిటీలు అన్నాక వారిపై రకరకాల రూమర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఈ గాసిప్స్ లను కొందరు లైట్ తీసుకుంటారు.. మరి కొందరు ఘాటుగా వాటిపై స్పందిస్తుంటారు. ఇక కొంత మంది మాత్రం వాటిని చూసి నవ్వుకుంటారు. అయితే ఇటీవల తన పెళ్లిపై వస్తున్నరూమర్లకు హీరోయిన్ నిత్యామీనన్ స్పందించింది. అయినా కానీ ఆమె పై మరికొన్ని రూమర్లు వస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నిత్యామీనన్.. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తన కం టూ తెలుగులో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. నిత్యామీనన్ పై గత కొంతకాలంగా రూమర్స్ వస్తున్న సంగతి మనకు తెలిసిందే. అదీ కాక ఆ గాసిప్స్ పై ఆమె స్పందించిన విషయమూ తెలుసు. అయినా గాని ఆమె పై వచ్చే రూమర్లు మాత్రం ఆగట్లేదు. తాజాగా వస్తున్న రూమర్ల పై నిత్యామీనన్ మరో సారి స్పందించింది. '' నేను కాలికి దెబ్బతగిలి విశ్రాంతి తీసుకుంటే.. పెళ్లి చేసుకుంది కాబట్టే కథలు వినడం లేదు అంటూ పుకార్లు పుట్టించారు. కొంత మంది మిమ్మల్ని పెళ్లి చేసుకోమని దుల్కర్ సల్మాన్ సూచించారట కదా అని అడగ్గా.. దుల్కర్ నాకు మంచి స్నేహితుడు అందుకే పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండమని నాకు చెబుతూ ఉంటాడు. కానీ నాకు ప్రస్తుతానికి పెళ్లి ఆలోచన లేదు. అంటూ చెప్పుకొచ్చింది. ఇక మరికొన్ని గాసిప్స్ పై స్పందిస్తూ.. నేను పరిశ్రమలో ఎప్పుడూ ఎదుర్కొనే ఇబ్బంది ఏంటంటే! '' నన్ను ఇండస్ట్రీ బ్యాన్ చేసింది అన్న వార్తలు పుట్టించారు. ఇలా కావాలనే తప్పుడు ప్రచారం చేశారు. ఎదిగే వాళ్లను తొక్కాలని చూస్తారు అలాంటి వాళ్ల గురించి ఆలోచిస్తే మన గమ్యాన్ని మనం చేరుకోలేం ఇలాంటి విషయాలకి తెలుగులో చాలా సామెతలు ఉన్నాయి.'' అంటూ సమాధానం చెప్పుకొచ్చింది. మరి నటి నిత్యామీనన్ పై వరుసగా వస్తున్నా రూమర్లపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: ఇండస్ట్రీలో చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కానీ.. ప్రభాస్ స్పెషల్! ఇదీ చదవండి: Liger: లైగర్ సినిమాకు బాయ్‌కాట్ సెగ.. అసలు కారణాలు ఏంటంటే?