దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక, అమ్మను సృష్టించాడని అంటుంటారు. తన బిడ్డకు ఏ చిన్న ప్రమాదం జరిగినా.. తన కంటి నుంచి నీరు వస్తుంది. అంతలా విల విలలాడుతుంది తల్లి. కానీ ఓ ప్రముఖ సినీ నటి తాను బ్రతికుండగానే తన కూతురు చనిపోవాలి కోరుకుంది.. ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకుందన్న విషయానికి వస్తే.. ప్రముఖ నటి ఇందు ఆనంద్ పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది. బుల్లితెరపై వచ్చిన మొగలిరేకులు, చక్రవాకం, కళ్యాణ వైభోగమే వంటి సూపర్ హిట్ సీరియల్స్ లో నటించింది. బద్రి, గమనం, బుడుగు వంటి అనేక సినిమాల్లో క్యారెక్టర్ ఆరిస్టుగా నటించారు. ఎలాంటి పాత్ర అయినా అలవోకగా నటించే ఇందు ఆనంద్ జీవితంలో ఎన్నో కష్టాలు.. కన్నీళ్లు.. మానసిక వేదన ఉందట. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన కూతురు గురించి చెప్పి కన్నీరు పెట్టుకుంది. పెళ్లయిన తర్వాత తాను ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న సమయంలో భర్త ప్రోత్సాహంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాను. ఆ తర్వాత పలు సీరియల్స్, మూవీస్ లో నటించాను. తనకు మూడు సర్జరీలు అయ్యాయి. ఈ వయసులో కూడా తాను కష్టపడుతున్నానంటే తన కూతురు కోసమే అని.. ఆమెను హ్యాపీగా చూసుకోవడం తన కర్తవ్యం అన్నారు. తన కూతురు పుట్టుకతోనే మతిస్థిమితం లేని అమ్మాయిగా పుట్టింది. తన భర్త చనిపోయిన తర్వాత తన కూతురు కి అన్నీ తానై పెంచినట్లు తెలిపారు. తన కూతురు ఆరోగ్య పరిస్థితి గురించి ఏనాడూ ఆలోచించలేదని.. కాకపోతే తాను తాను బతికి ఉండగానే.. తన కూతురు చనిపోవాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు తెలిపారు. దానికి కారణం తన మరణం తర్వాత కూతురి ఆలనా పాలనా చూసేవారు ఎవరూ ఉండరు. ఆ దారుణమైన పరిస్థితి రాకముందే తన కూతురు తన చేతిలో మరణించాలని.. ప్రపంచంలో ఏ తల్లీ కోరని కోరిక కోరుకుంటున్నట్లు ఆవేదన వ్యక్తం చేసింది. నిజమైన తల్లి ప్రేమ ఇందు ఆనంద్ మాటల్లో వినిపిస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే.. ‘సలార్’ రిలీజ్ డేట్ వచ్చేసింది! ఇది చదవండి: భర్త మరణం తర్వాత సంచలన నిర్ణయం తీసుకున్న నటి మీనా!