బాలీవుడ్ లో నటుడిగా మిస్టర్ పర్ఫెక్ట్ అనిపించుకున్న ఆమిర్ ఖాన్.. తన స్టేట్ మెంట్స్, సినిమాల విషయంలో మాత్రం వివాదాలకు గురవుతున్నాడు. గతంలో ఆమిర్ చేసిన వివాదాస్పద స్టేట్ మెంట్స్ అన్నీ.. ఇప్పుడు అతని సినిమా రిలీజ్ టైంలో సమస్యలై వెంటాడుతున్నాయి. ప్రస్తుతం ఆమిర్ నటించిన కొత్త సినిమా 'లాల్ సింగ్ చడ్డా' విడుదలకు రెడీ అయ్యింది. ఆగష్టు 11న పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో రిలీజ్ అవుతున్న ఈ సినిమా విషయంలో ఆమిర్ ఎక్కడికి వెళ్లినా నెగటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఓవైపు లాల్ సింగ్ చడ్డా మూవీని బాయ్ కాట్ చేయాలని డిమాండ్ చేస్తూనే.. మరోవైపు గతంలో తనకు, తన ఫ్యామిలీకి ఇండియాలో సేఫ్టి లేదని ఆమిర్ చేసిన వ్యాఖ్యలను ఎత్తిచూపిస్తూ విమర్శిస్తున్నారు. లాల్ సింగ్ చడ్డా మూవీ హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషలలో రిలీజ్ అవుతోంది. కానీ.. ఆమిర్ చేసిన స్టేట్ మెంట్స్ వలన సినిమాకు తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. అయితే.. దీనిపై ఇదివరకే స్పందించి.. తన సినిమాను బాయ్ కాట్ చేయొద్దని, అందరూ సినిమా చూడాలని కోరాడు. ఇక ఇప్పుడు మరోసారి ఆమిర్ సినిమా విషయంలో వినిపిస్తున్న వ్యతిరేకతపై క్షమాపణలు కోరినట్లు తెలుస్తుంది. "నాకు ప్రేక్షకుల మీద నమ్మకం ఉంది. నా ఫింగర్స్ కూడా క్రాస్ చేసి ప్రార్థిస్తున్నాను. నేను ఎవరినైనా హర్ట్ చేసిన ఉంటే దయచేసి నన్ను క్షమించండి. అలాగే నా సినిమా చూడకూడదనే మీ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. కానీ.. వీలైనంత ఎక్కువమంది నా సినిమా చూడాలని కోరుతున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు ఆమిర్. మరి లాల్ సింగ్ చడ్డా మూవీపై ప్రేక్షకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఆమిర్ ఖాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. Superstar #AamirKhan appeals against boycotting #LaalSinghChaddha a day before the movie's release. Listen to what actor Nassar Abdullah has to say about Aamir Khan's big apology. (@Akshita_N) #ITVideo pic.twitter.com/nZkfhvEpvx — IndiaToday (@IndiaToday) August 10, 2022 ఇదీ చదవండి: సమంత ఎదురైతే హగ్ ఇస్తా: నాగచైతన్య