ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం జరిగింది. కూతురు సమయానికి అన్నం పెట్టలేదని ఓ తండ్రి కిరాతకుడిగా మారాడు. ఇంట్లో ఉన్న కొడవలితో తండ్రి కూతురుని దారుణంగా హత్య చేశాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హపూర్ పరిధిలోని ఓ ప్రాంతంలో మహ్మద్ ఫరియాద్ (55) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. ఇతనికి ఆరుగురు సంతానం. వీరిలో కూతురు రేష్మ అనే 22 ఏళ్ల యువతి ఇంటి దగ్గరే ఉండేది. అయితే ఇటీవల తండ్రి ఫరియాద్ ఇంటికొచ్చి అన్నం పెట్టాలని కూతురుకు చెప్పాడు. కూతురు కాస్త లేట్ గా రావడంతో తండ్రి కోపంతో ఊగిపోయాడు. తండ్రి కూతురిపై మాటల దాడికి చేయడంతో.. కూతురు కూడా తండ్రికి దీటుగా సమాధానం ఇచ్చింది. నాకే ఎదురు సమాధానం చెబుతావా అంటూ తండ్రి విర్రవీగిపోయాడు. ఏకంగా ఇంట్లో ఉన్న కోడవలి తీసుకుని కూతురుని దారుణంగా హత్య నరికాడు. తండ్రి దాడిలో రక్తపు మడుగులో పడి కూతురు రేష్మ అక్కడికక్కడే ప్రాణాలు వదిలింది. ఈ విషయం ఇరుగు పోరుగు వారికి తెలియడంతో వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. మరో విషయం ఏంటంటే? మరో వారం రోజుల్లోనే రేష్మ వివాహం ఉండడం విశేషం. ఇక పెళ్లి జరగబోయే వారం రోజుల ముందే ఈ దారుణం జరగడంతో కుటుంబ సభ్యులు అంతా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: భర్త ఫ్రెండ్ తో 42 ఏళ్ల మహిళ రాసలీలలు.. సడెన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త!