తాము ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలని ప్రతీ ఒక్కరు కష్టపడుతుంటారు. కానీ వెళ్లేదారిలో వచ్చే ఆటుపోట్లను సైతం దాటుకుంటూ వెళ్తుంటారు. కానీ ఎక్కడో ఓ చోట బెడిసికొడుతుంది. అలాగే ఓ యువతి తన ఆశయం దిశగా ఇలాగే అడుగులు ముందుకేసి తన గమ్యాన్ని చేరుకోవాలనుకుంది. కానీ ఆమె ప్రయత్నం బెడిసికొట్టడంతో తనపై తాను విరక్తి చెందింది. ఈ క్రమంలోనే చివరికి ఆత్మహత్య చేసుకుంది. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తమిళనాడు రాష్ట్రం తిరుముల్ లైవాయల్ పరిధిలోని ఇందిరా నగర్ ప్రాంతానికి చెందిన లక్ష్మి (19) అనే యువతి ఇంటర్ పూర్తి చేసింది. తల్లిదండ్రులు ఉన్నత చదువులు చదవడంతో ఆమె తల్లి స్థానిక పాఠశాల్లో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వర్తిస్తుంది. అయితే లక్ష్మి తాను ఎంచుకున్న లక్ష్యాన్ని సాధించాలనే తపనతో ఇంటర్ లో మంచి మార్కులతో పాస్ అయింది. చదువుల్లో సరస్వతిగా రాణించిన లక్ష్మి.. ప్లస్ టూ తర్వాత నీట్ పరీక్ష రాయాలనుకుంది. ఇక ఇందులో భాగంగానే లక్ష్మి గత రెండుళ్ల నుంచి నీట్ పరీక్షకు సిద్దమవుతూ ఆన్ లైన్ లో కోచింగ్ కూడా తీసుకుంది. కోచింగ్ కూడా పూర్తై గత నెల నీట్ పరీక్ష కూడా రాసింది. దీనికి సంబంధించిన ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. కానీ ఆమెకు నీట్ ఫలితాల్లో ఆశించినంతగా మార్కులు రాలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన లక్ష్మికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏదో సాధించాలని కలలు కంటే ఇలా జరిగిందేంటి అని తనలో తాను కుమిలిపోయి ఏడ్చింది. ఇక ఏం చేయాలో అర్థం కాలేదు, ఈ క్రమంలోనే లక్ష్మి ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని ఆత్మహత్య చేసుకున్న లక్ష్మి లాంటి యువతులకు మీరిచ్చే సలహాలు, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు.. ఎలాగైన పెళ్లి చేసుకోవాలని!