టెలికాం రంగంలోకి అడుగుపెట్టాక 'రిలయన్స్ జియో' సృష్టించిన అలజడి అంతా.. ఇంతా కాదు. ఆ రంగం రూపురేఖలే మారిపోయాయి. దేశంలో టెలికాం సేవలు అందిస్తున్న సంస్థల్లో అగ్రస్థానానికి జియో చేరిపోయింది. ఇతర ఆపరేటర్ల పరిథిలోని వినియోగదారులను తనవైపుకు మళ్లించుకోగలిగింది. ఇవన్నీ వారికి ఊరికే.. రాలేదు. ప్రారంభంలో ఏడాది పాటు అన్ని సేవలు ఫ్రీ అంటూ.. నష్టాలను సైతం భరించింది. ఆ తరువాత కూడా తక్కువ ధరలకే టారిఫ్‌లు తీసుకొస్తూ సామాన్యులకు సైతం అందుబాటు ధరల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంది. ఈ ప్రణాళిక వారిని అగ్రస్థానంలో నిలబెట్టింది. ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకుంటున్న జియో.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. ఆ ప్లాన్ వివరాలేంటో చూద్దాం.. జియో ఇండిపెండెన్స్ డే ప్లాన్ ప్రీపెయిడ్ వినియోగదారుల కోసమే జియో.. 'ఇండిపెండెన్స్ డే 2022' ఆఫర్‌ను ప్రకటించింది. తాజా ప్లాన్‌తో కస్టమర్లకు రూ.3,000 విలువైన ప్రయోజనాలతో పాటు ఏడాది వరకు వ్యాలిడిటీ అందిస్తోంది. ఈ కొత్త ప్లాన్‌కు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. "జియో అందిస్తున్న రూ. 2999 ఇండిపెండెన్స్ ఆఫర్‌తో స్వాతంత్య్ర దినోత్సవాన్ని సెలబ్రెట్ చేసుకోండి.. రూ. 3000 విలువైన ఉచిత ప్రయోజనాలను ఆస్వాదించండి"అని రిలయన్స్ జియో ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. జియో రూ. 2,999 ప్లాన్: ఈ ప్లాన్ వ్యాలిడిటీ 365 రోజులు. ఇందులో అన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు, ప్రతి రోజు 100 ఎస్ఎంఎస్ లు, 2.5GB రోజువారీ డేటా పొందుతారు. రోజువారీ డేటా యూసేజ్ లిమిట్ ముగిసిన తర్వాత, ఇంటర్నెట్ స్పీడ్ 64kbpsకి పడిపోతుంది. ఈ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు రూ. 3,000 విలువైన అదనపు ప్రయోజనాలను సైతం జియో అందిస్తోంది. ఇతర ప్రయోజనాలు: 75GB అదనపు డేటా ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ రూ. 750 విలువైన Ajio కూపన్ నెట్‌మెడ్స్‌పై రూ. 750 తగ్గింపు Ixigoపై రూ. 750 తగ్గింపు Celebrate freedom with Jio's ₹2999 Independence offer and enjoy free benefits worth ₹3000 Recharge now: https://t.co/vBXlf7ckat#JioDigitalLife #WithLoveFromJio pic.twitter.com/xH8n5FG5DO — Reliance Jio (@reliancejio) August 9, 2022 ఈ ప్లాన్ పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: Jio: జియో కస్టమర్లకు సూపర్ ఛాన్స్.. రూ.20కే 28GB ఎక్స్‌ట్రా డేటా..! ఇదీ చదవండి: Reliance Jio: రిలయన్స్ జియో బాధ్యతల నుంచి తప్పుకుంటున్న ముఖేశ్ అంబానీ! కొత్త చైర్మన్ గా..