నిత్యవసర వస్తువుల ధరలు భరించలేక విలవిలలాడుతున్న సామాన్య ప్రజానీకానికి ఈ వార్త తీపికబురు లాంటిది. అంతర్జాతీయంగా వంట నూనెల ధరలు తగ్గడంతో.. ధరలు తగ్గించాలని కేంద్రం ఆయా కంపెనీలకు సూచించింది. ఈ నేపథ్యంలో ఆయిల్ కంపెనీలు ఒక్కొక్కటిగా ధరలు తగ్గిస్తున్నట్లు ప్రకటిస్తున్నాయి. వంట నూనెల ధరలు లీటరుకు రూ.15 నుంచి రూ.30 వరకు తగ్గనున్నాయి. ఫార్చూన్ బ్రాండ్ అంతర్జాతీయంగా ధరలు తగ్గిన నేపథ్యంలో వంట నూనెల ధరలను గరిష్టంగా రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ఫార్చూన్ బ్రాండ్ వంట నూనెలు విక్రయించే ఆదానీ విల్మర్ కంపెనీ ప్రకటించింది. త్వరలోనే తగ్గించిన ధరలు మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయని కంపెనీ ఎండీ, సీఈఓ అంగు మల్లిక్ పేర్కొన్నారు. ఫార్చూన్ సోయాబీన్ ఆయిల్ లీటర్ రూ.195 నుంచి రూ.165 కి తగ్గింది. ఫార్చూన్ సన్ ఫ్లవర్ ఆయిల్ రూ.210 నుంచి రూ.199కి తగ్గింపు ఆవ నూనె గరిష్ఠ ధర రూ.195 నుంచి రూ.190కి తగ్గింపు రైస్ బ్రాన్ ఆయిల్ 225 నుంచి 210కి తగ్గింపు వేరు శనగ నూనె 220 నుంచి 210కి తగ్గింపు ఇమామి ఇమామి కంపెనీ కూడా తన ప్రొడక్టులపై ధరలను తగ్గించింది. లీటరుకు గరిష్టంగా రూ. 35 వరకు తగ్గించింది. సోయాబీన్ ఆయిల్ లీటర్ రూ. 215 నుంచి రూ. 180కి తగ్గింది. కచిగని మస్టర్డ్ ఆయిల్ లీటర్ రూ. 215 నుంచి రూ. 198కి తగ్గింది. రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ రూ. 220 నుంచి రూ.190కి తగ్గింది. జెమిని జెమిని కంపెనీ కూడా ఆయిల్ ధరలను తగ్గించింది. సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ రూ.200 నుంచి రూ.192కి తగ్గింది. ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ లీటర్ రూ.190 నుంచి రూ.175కి తగ్గింది. వేరుశనగ నూనె లీటర్ రూ. 200 నుంచి రూ.185కి తగ్గింది. కచిగని మస్టర్డ్ ఆయిల్ లీటర్ రూ.215 నుంచి రూ.185కి తగ్గింది. ఫస్ట్ క్లాస్ పామోలిన్ ఆయిల్ లీటర్ రూ.170 నుంచి రూ.150కి తగ్గింది.